ఫోన్ ట్యాపింగ్ కేసులో( Phone Tapping Case ) పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.ఈ మేరకు కేసులో ప్రధాన సూత్రధారిని విచారించేందుకు లుక్ ఔట్ నోటీసులు ఇచ్చామని హైదరాబాద్ సీపీ శ్రీనివాస్ రెడ్డి( Hyderabad CP Srinivas Reddy ) తెలిపారు.
రెడ్ కార్నర్ నోటీస్( Red Corner Notice ) ఇంకా జారీ చేయలేదని సీపీ శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.ఊహాగానాలతో దర్యాప్తునకు ఇబ్బంది కలిగిస్తున్నారని తెలిపారు.అదేవిధంగా కేసులో రాజకీయ నేతల ప్రమేయంపై కూడా దర్యాప్తు కొనసాగుతోందని సీపీ శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.ఇప్పటివరకు కీలక వ్యక్తులను విచారించామన్న ఆయన మరి కొందరి నుంచి స్టేట్ మెంట్ రికార్డు చేశామని తెలిపారు.







