ప్రతి ఒక్కరు చర్మం మచ్చలు లేకుండా అందంగా ఉండాలని కోరుకుంటారు.దాని కోసం ఎన్ని రకాలైన ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.
రకరకాల కాస్మొటిక్స్ కూడా వాడుతూ ఉంటారు.కానీ ప్రయోజనం మాత్రం కాస్త తక్కువగానే ఉంటుంది.
ఇప్పుడు చెప్పే సముద్ర ఉప్పుతో ఆ సమస్య నుండి సమర్ధవంతంగా బయట పడవచ్చు.అది ఎలాగా అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
నాలుగు స్పూన్ల కొబ్బరినూనెలో రెండు స్పూన్ల సముద్ర ఉప్పును కలిపి స్క్రబ్ గా తయారుచేసుకోవాలి.ఈ స్క్రబ్ ని ముఖానికి రాసి 5 నిమిషాల పాటు మసాజ్ చేసి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే చర్మంలో మలినాలు తొలగిపోయి ముఖం కాంతివంతంగా ఉంటుంది.
మూడు స్పూన్ల నిమ్మరసంలో మూడు స్పూన్ల సముద్ర ఉప్పును కలిపి ముఖానికి రాసి 5 నిమిషాల పాటు మసాజ్ చేసి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఈ విధంగా వారానికి ఒకసారి చేస్తూ ఉంటే ముఖం కాంతివంతంగా ఉండటమే కాకుండా మంచి రంగు కూడా వస్తుంది.
నాలుగు స్పూన్ల ఆలివ్ ఆయిల్ లో మూడు స్పూన్ల సముద్ర ఉప్పు, ఒక స్పూన్ ఓట్ మీల్ కలపాలి.ఈ పేస్ట్ ని ముఖానికి పట్టించి 5 నిమిషాల పాటు మసాజ్ చేసి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
ఈ విధంగా నెలలో రెండు సార్లు చేస్తూ ఉంటే చర్మం తేమగా ఉంటుంది.