లండన్‌లోని భారత హైకమీషన్‌పై దాడి కేసు .. ఎన్ఐఏ అదుపులో ఇంద్రపాల్ సింగ్

గతేడాది మార్చిలో ఖలిస్తాన్ వేర్పాటువాద నేత, వారిస్ పంజాబ్ దే చీఫ్ అమృత్‌పాల్ సింగ్( Amritpal Singh ) వ్యవహారం భారత్‌తో పాటు చాలా దేశాల్లో అలజడి రేపిన సంగతి తెలిసిందే.అతనికి మద్ధతుగా అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియాల్లోని భారత రాయబార కార్యాలయాలపై ఖలిస్తాన్ మద్ధతుదారులు ఆందోళన వ్యక్తం చేశారు.

 London Resident Inderpal Singh Gaba Arrested By Nia In Indian Mission Attack Cas-TeluguStop.com

ఇది హింసాత్మకంగా మారి ఆస్తుల విధ్వంసం వరకు వెళ్లింది.ఈ ఘటనలపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దర్యాప్తు ముమ్మరం చేసింది.

దీనిలో భాగంగా లండన్‌లో భారత హైకమీషన్ కార్యాలయంపై జరిగిన దాడిలో ప్రమేయమున్న వ్యక్తిని పంజాబ్‌లోని భారత్ – పాకిస్తాన్ సరిహద్దుల్లో ఎన్ఐఏ( NIA ) అరెస్ట్ చేసింది.

పశ్చిమ లండన్‌లోని హౌన్‌స్లో నివాసి అయిన ఇంద్రపాల్ సింగ్ గబ్బాపై( Inderpal Singh Gaba ) UAPA చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.2023 మార్చి 19, 22 తేదీల్లో లండన్‌లోని ఇండియా హౌస్( India House ) వద్ద రెండు హింసాత్మక నిరసనలు జరిగాయి.మార్చి 19న పెద్ద సంఖ్యలో నిరసనకారులు భారతీయ దౌత్య సిబ్బందిపై దాడి చేసి.

హైకమీషన్ కార్యాలయాన్ని ధ్వంసం చేసి , భారత జాతీయ జెండా పట్ల అవమానకరంగా ప్రవర్తించారు.మార్చి 22న నిరసనకారుల గుంపు భారతదేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి, బెదిరింపులకు పాల్పడ్డారు.

Telugu Amritpal Singh, Attari, India, Inderpalsingh, Indian Attack, London, Circ

దర్యాప్తులో భాగంగా పంజాబ్, రాజస్థాన్‌లలోని 31 ప్రదేశాలలో సోదాలు నిర్వహించిన ఎన్ఐఏ పలువురు అనుమానితులను విచారించారు.ఎన్ఐఏ దర్యాప్తు బృందం కూడా లండన్‌కు( London ) వెళ్లిందని సంబంధిత వర్గాలు తెలిపాయి.ఇంద్రపాల్ సింగ్ గాబా సహా అనేక మంది అనుమానితులపై ఎల్‌వోసీ (లుక్ ఔట్ సర్క్యూలర్) జారీ చేశారు.ఈ క్రమంలో ఇంద్రపాల్ .గతేడాది డిసెంబర్ 9న పాకిస్తాన్ నుంచి భారత్‌లోకి ప్రవేశించినప్పుడు అట్టారీ సరిహద్దుల్లో( Attari Border ) అదుపులోకి తీసుకున్నారు.విచారణలో భాగంగా అతడి మొబైల్‌ను స్వాధీనం చేసుకుని డేటాను సేకరించారు.

Telugu Amritpal Singh, Attari, India, Inderpalsingh, Indian Attack, London, Circ

గతేడాది మార్చిలో జరిగిన హింసాత్మక నిరసనలు బ్రిటీష్ పార్లమెంట్‌లో పదే పదే లేవనెత్తారు.లండన్‌లోని ఇండియా హౌస్ వెలుపల మెట్రోపాలిటన్ పోలీస్ భద్రత కల్పించకపోవడం స్పష్టంగా కనిపించింది.నాటి ఘటనకు సంబంధించి ఎన్ఐఏ ఐదు వీడియోలను విడుదల చేసింది.ఈ హింసాత్మక నిరసనలలో పాల్గొన్న వ్యక్తులను గుర్తించడంలో సాధారణ ప్రజల సహాయాన్ని కోరింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube