ప్రతి వారంలా ఈ వారం కూడా థియేటర్లు ఓటీటీలలో( OTT ) క్రేజీ సినిమాలు విడుదలవుతుండగా ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద, ఓటీటీలలో ఎలాంటి ఫలితాన్ని సొంతం చేసుకోనున్నాయో చూడాల్సి ఉందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ఈ వారం రిలీజ్ కానున్న సినిమాలలో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ( Gangs of Godavari )సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడటం గమనార్హం.
కృష్ణచైతన్య( Krishna Chaitanya ) డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో నేహాశెట్టి హీరోయిన్ గా నటించగా అంజలి కీలక పాత్ర పోషిస్తుండటం గమనార్హం.ఇప్పటికే ఎన్నోసార్లు వాయిదా పడిన ఈ సినిమా మే నెల 31వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది.
ఈ సినిమా ఒక విభిన్నమైన గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కుతోంది.లంకల రత్న అనే గ్యాంగ్ స్టర్ రోల్ లో విశ్వక్ సేన్ ఈ సినిమాలో కనిపించనున్నారు.
కార్తికేయ నటించిన భజే వాయు వేగం మూవీ( Bhaje Vayu Vela movie ) కూడా ఈ వారం థియేటర్లలో రిలీజ్ కానుందని తెలుస్తోంది.ఈ సినిమా కూడా మే 31వ తేదీనే విడుదల కానుంది.

ఆనంద్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన గం గం గణేశా( Gam Gam Ganesha ) ఉదయ్ శెట్టి డైరెక్షన్ లో తెరకెక్కుతోంది.జాన్వీ కపూర్ ప్రధాన పాత్రలో నటించిన మిస్టర్ అండ్ మిస్సెస్ మహి ( Mr.and Mrs.Mahi )ఈ నెల 31వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుందని భోగట్టా.ఇందులో ఆమె క్రికెటర్ గా కనిపించనున్నారని సమాచారం అందుతోంది.నెట్ ఫ్లిక్స్ లో ఈ నెల 30న ఎరిక్ వెబ్ సిరీస్, గీక్ గర్ల్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానున్నాయి.

అమెజాన్ ప్రైమ్ లో ఈ నెల 28వ తేదీన పంచాయత్3( Panchayat3 ) వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.జీ5 యాప్ లో ఈ నెల 28న స్వతంత్ర వీర్ సావస్కర్( Veer Savaskar ) స్ట్రీమింగ్ కానుండటం గమనార్హం.డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో కామ్ డెన్ వెబ్ సిరీస్ మే 28న స్ట్రీమింగ్ కానుండగా ది ఫస్ట్ ఆమెన్ హాలీవుడ్ సిరీస్ మే 30వ తేదీన స్ట్రీమింగ్ కానుంది.ఉప్పు పులి కారమ్ తమిళ్ వెర్షన్ కూడా మే నెల 30వ తేదీన హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది.
మే 29వ తేదీన ఇల్లీగల్3 హిందీ సిరీస్, మే 31వ తేదీన దేడ్ బీఘా జమీన్ హిందీ వెర్షన్, ది లాస్ట్ రైఫిల్ మ్యాన్ అనే హాలీవుడ్ సిరీస్ సైతం ఈ నెల 31వ తేదీన స్ట్రీమింగ్ కానుంది.