రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఎన్నికలు గురించి ఎంత చర్చ అయితే జనాల్లో జరుగుతుందో , అంతక మించిన స్థాయిలో పిఠాపురం నియోజకవర్గం( Pithapuram Constituency ) గురించిన చర్చ జనాల్లో జరుగుతోంది.ఇక్కడ నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) పోటీ చేయడమే దీనికి కారణం.టిడిపి, జనసేన , బిజెపి పొత్తులో భాగంగా పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీకి దిగారు.2019 ఎన్నికల్లో భీమవరం , గాజువాక నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి చెందడంతో ఈసారి పిఠాపురం లో గెలుపును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
పవన్ ను గెలిపించేందుకు సినీ ప్రముఖులు ఎంతోమంది పిఠాపురం వచ్చి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.పవన్ కు ప్రత్యర్థిగా వైసిపి నుంచి వంగ గీత( Vanga Geetha ) పోటీ చేశారు.స్థానికంగా బలమైన నాయకురాలు కావడం , మహిళా సెంటిమెంటు ఇవన్నీ కలిసి వస్తాయని ఉద్దేశంతో జగన్ ( Jagan ) ఆమెను అభ్యర్థిగా నిలబెట్టారు.పిఠాపురంలో వంగ గీతను గెలిపిస్తే ఉప ముఖ్యమంత్రి చేస్తానంటూ ఎన్నికల ప్రచారం చివరి రోజున పిఠాపురంలో నిర్వహించిన సభలో జగన్ హామీ ఇచ్చా రు.ఇతరులు ఎవరు గెలుస్తారనేది జూన్ 4వ తేదీన తేలిపోనుంది.ఇది ఇలా ఉంటే ఎన్నికల ఫలితాలు వెలబడకుండానే పిఠాపురంలో మరో హడావుడి నడుస్తోంది.
పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంటూ జనసేనకు చెందిన వారు తమ బైక్ నెంబర్ ప్లేట్ల పైన, కార్ల పైన , స్టిక్కర్లు వేసుకోవడం, ఇవి కాస్త సోషల్ మీడియాలోనూ వైరల్ కావడంతో , వైసిపి అభ్యర్థి వంగ గీత అనుచరులు సైతం జన సైనికులకు పోటీగా డిప్యూటీ సీఎం గారి తాలూకా అంటూ స్టిక్కర్లు తమ బైక్ లు, కార్లకు వేసుకుంటున్నారు.ఇంకా ఎన్నికల ఫలితాలు రాకముందే పిఠాపురంలో ఈ స్థాయిలో జనసేన, వైసిపి నాయకులు మధ్య స్టిక్కర్ వార్ తీవ్రంగా జరుగుతోంది.