పార్వతీపురం( Parvathipuram ) మన్యం జిల్లా జియ్యమ్మవలస మండలంలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి.బిత్రపాడులో శునకాలు రోడ్లపై వెళ్తున్న వారిపై దాడులకు పాల్పడుతున్నాయి.
ఈ క్రమంలోనే తాజాగా ఇద్దరు వ్యక్తులపై వీధి కుక్కలు దాడి చేశాయి.ఈ దాడిలో ఒకరు మృత్యువాత పడగా.
మరో వ్యక్తికి తీవ్రగాయాలు అయ్యాయి.ప్రస్తుతం బాధితుడికి చినమెరంగి సామాజిక ఆరోగ్య కేంద్రంలో వైద్యం అందిస్తుండగా.
అతని పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.కుక్కల దాడి నేపథ్యంలో అధికారులకు సమాచారం ఇచ్చిన పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.