పెద్దపల్లి బీజేపీ అభ్యర్థిగా ఎవరు నిలుస్తారనే అంశానికి తెర పడింది.ఈ మేరకు పెద్దపల్లి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థిగా గోమాస శ్రీనివాస్( Gomasa Srinivas ) నిలిచారు.
నియోజకవర్గంలో బీజేపీ ఆల్టర్ నేట్ అభ్యర్థి ఎస్.కుమార్ దాఖలు చేసిన నామినేషన్ ను ఎన్నికల అధికారి ఆమోదించలేదు.బీజేపీ బీ-ఫామ్ లో ఇద్దరి పేర్లలో ఒకరినే ఎన్నికల అధికారి ఆమోదించారు.
ఈ క్రమంలోనే పెద్దపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా గోమాస శ్రీనివాస్ నామినేషన్ కు ఆమోదం తెలిపారు.
దీంతో పెద్దపల్లి బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ ను నిర్ణయించారు.అయితే పెద్దపల్లిలో బీజేపీ అభ్యర్థిగా గోమాస శ్రీనివాస్ మరియు ఎస్ కుమార్* S Kumar ) నామినేషన్లను దాఖలు చేశారు.
గోమాస శ్రీనివాస్ కు బీ-ఫామ్ ఇచ్చిన బీజేపీ( BJP ) ఆల్టర్ నేట్ అభ్యర్థిగా ఎస్ కుమార్ పేరును చేర్చింది.నామినేషన్ల ఉపసంహరణలోపు ఇద్దరిలో ఒకరికి సీ-ఫామ్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.
అయితే తాజాగా ఎన్నికల అధికారి ఆల్టర్ నేట్ అభ్యర్థి ఎస్ కుమార్ నామినేషన్ ను తిరస్కరించింది.దీంతో పెద్దపల్లి నియోజకవర్గ అభ్యర్థిగా గోమాస శ్రీనివాస్ నిలిచారు.







