డెలివరీ తర్వాత ముఖాన్ని అద్దంలో చూసుకోలేకపోతున్నారా.. వర్రీ వద్దు మునుపటి మెరుపును ఈజీగా పొందండిలా!

సాధారణంగా డెలివరీ అనంతరం( After Delivery ) మహిళల ముఖంలో మునుపటి మెరుపు కనిపించదు.కంటినిండా నిద్ర లేకపోవడం, ఆహారపు అలవాట్లు, పలు రకాల మందుల వాడకం, ఒత్తిడి తదితర కారణాల వల్ల ముఖం కాంతిహీనంగా మారుతుంది.

 How To Get Glowing Skin After Delivery!,glowing Skin, Women, Delivery, Home Reme-TeluguStop.com

నిర్జీవంగా కనిపిస్తుంది.దీంతో చాలా మంది ముఖాన్ని అద్దంలో చూసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతుంటారు.

కానీ వర్రీ వద్దు.దాదాపు మహిళలందరూ ఈ స్టేజ్‌ను ఫేస్ చేస్తారు.

అయితే ఆ సమయంలో ఇలా ఎందుకు ఉన్నాము అని బాధపడడం మానేసి కొన్ని కొన్ని ఇంటి చిట్కాలు పాటిస్తే మళ్ళీ మునుపటి మెరుపు( Skin Glow )ను పొందొచ్చు.

Telugu Tips, Delivery, Skin, Remedy, Latest, Skin Remedy, Skin Care Tips, Skin S

ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే రెమెడీ అందుకు అద్భుతంగా సహాయపడుతుంది.ఈ రెమెడీని డెలివరీ తర్వాత రెండు రోజులకు ఒకసారి పాటించిన చాలు ఈజీగా ముఖంలో మునుపటి మెరుపును పొంద‌వ‌చ్చు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక అరటి పండు( Banana )ను తీసుకొని తొక్క తొలగించి ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న అరటిపండు ముక్కలు, ఒక ఎగ్ వైట్( Egg White ), రెండు టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్, వన్ టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి మెడకు అప్లై చేసుకుని ఇర‌వై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.

Telugu Tips, Delivery, Skin, Remedy, Latest, Skin Remedy, Skin Care Tips, Skin S

ఆపై గోరువెచ్చని నీటితో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకుని మంచి మాయిశ్చరైజర్ ను అప్లై చేసుకోవాలి.రెండు రోజులకు ఒకసారి ఈ రెమెడీని కనుక పాటిస్తే ప్రెగ్నెన్సీ( Pregnancy ) కారణంగా సాగిన చర్మం బిగుతుగా మారుతుంది.స్కిన్ పై పేరుకు పోయిన డెడ్ స్కిన్ సెల్స్( Dead Skin Cells ) తొలగిపోతాయి.చర్మం తెల్లగా కాంతివంతంగా మారుతుంది.మళ్లీ మునుపటి మెరుపు మీ ముఖంలో కనిపిస్తుంది.కాబట్టి డెలివరీ తర్వాత చర్మాన్ని అందంగా మెరిపించుకునేందుకు తప్పకుండా ఈ హోమ్ రెమెడీని పాటించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube