కొడుకు గౌతమ్ ను చూసి తండ్రిగా ఎంతో గర్వపడుతున్నా.. మహేష్ బాబు పోస్ట్ వైరల్!

టాలీవుడ్ హీరో మహేష్ బాబు( Mahesh Babu ) గురించి ఆయన ఫ్యామిలీ గురించి మనందరికీ తెలిసిందే.మహేష్ బాబు సినిమాలకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో ఫ్యామిలీకి కూడా అంతే కంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.

 Mahesh And Namrata Insta Post On His Son Gautam Goes Viral , Mahesh Babu, Namra-TeluguStop.com

సినిమాల పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఫ్యామిలీకి తగినంత సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు మహేష్ బాబు.అందుకే ఏడాది కనీసం నాలుగైదు సార్లు అయినా ఫ్యామిలీతో కలిసి వెకేషన్ లకు వెళ్తూ ఉంటారు.

మహేష్ బాబు ఆయన భార్య నమ్రత( namrata ) ఇద్దరు కూడా వారి పిల్లలకు సంబంధించిన ఫోటోలు, వారికీ సంబంధించిన విషయాలను ఎప్పటి కప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు.

Telugu Gautham, Insta, Maheshnamrata, Mahesh Babu, Namrata, Tollywood-Movie

ఇది ఇలా ఉంటే తాజాగా మహేష్ బాబు సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు షేర్ చేయడంతో అవి కాస్త వైరల్ గా మారాయి.తాజాగా మహేష్ బాబు కొడుకు గౌతమ్ ఇంటర్మీడియట్ పట్టా అందుకున్నాడు.గౌతమ్ ఇంటర్ పూర్తి చేసి గ్రాడ్యువేషన్ పట్టా( Graduation Degree ) అందుకున్న సందర్భంగా మహేష్, నమ్రత ఇద్దరు ఎమోషనల్ అవుతూ చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.

తాను గర్వంతో పొంగిపోతున్నాను అని, లైఫ్ లో మరింత ఎత్తుకు ఎదగాలని, కలలని సాకారం చేసుకునేందుకు పరిగెత్తాలని, గౌతమ్ ని చూసి తండ్రిగా గర్వపడుతున్నాను అంటూ మహేష్ పోస్ట్ చేసారు.

Telugu Gautham, Insta, Maheshnamrata, Mahesh Babu, Namrata, Tollywood-Movie

నమ్రత కూడా గౌతమ్( Gautham ) పట్టా అందుకున్న సందర్భంగా ఫొటోస్ ని షేర్ చేస్తూ పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది.ఇక గౌతమ్ గ్రాడ్యుయేషన్ పట్టా అందుకున్న సందర్భంగా శుభాకాంక్షలు చెబుతున్నారు.కొందరు మహేష్ బాబు కూతురు సితార కొడుకు గౌతమ్ ల న్యూ లుక్ చూసి కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

మహేష్ బాబు సినిమాల విషయంలో వస్తే ప్రస్తుతం ఆయన రాజమౌళితో చెయ్యబోయే మూవీ కోసం ఆయన మేకోవర్ అవుతున్నాడు.అందుకే ఎక్కువగా పబ్లిక్ లోకి కానీ, ఫ్యామిలీ పిక్స్ లో కానీ అరుదుగా కనిపిస్తున్నారు.

ఇప్పుడు కొడుకు కోసం మహేష్ బయటికి వచ్చాడో లేదో ఇలా ఆయన లుక్ వైరల్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube