Back Pain Relief Remedy : న‌డుము నొప్పితో తీవ్రంగా స‌త‌మ‌తం అవుతున్నారా? అయితే ఇలా చేయండి!

నేటి ఆధునిక కాలంలో బిజీ లైఫ్ స్టైల్ కారణంగా చాలా మంది నడుము నొప్పితో తీవ్రంగా సతమతం అవుతున్నారు.అలాగే వయసు పై పడటం, అధికంగా వ్యాయామాలు చేయడం, ధూమపానం, కండరాలపై ఒత్తిడి ఎక్కువ‌గా ప‌డ‌టం, ప్రెగ్నెన్సీ, బ‌రువు పెర‌గ‌డం తదితర కారణాల వల్ల కూడా నడుము నొప్పి వేధిస్తూ ఉంటుంది.

 Effective Home Remedy To Get Rid Of Back Pain, Home Remedy, Back Pain, Back Pain-TeluguStop.com

కారణం ఏదైనప్పటికీ ఎక్కువ శాతం మంది నడుము నొప్పిని తగ్గించుకోవడం కోసం పెయిన్ కిల్లర్స్ ను వాడుతుంటారు.అయితే పెయిన్ కిల్ల‌ర్స్ తాత్కాలికంగా ఉపశమనం పొందడానికి మాత్రమే ఉపయోగపడుతుంది.

కానీ, ఇప్పుడు చెప్పబోయే రెమెడీని పాటిస్తే ఎలాంటి పెయిన్ కిల్లర్స్ వాడకుండానే న‌డుము నొప్పిని తరిమి కొట్టవ‌చ్చు.మరి ఇంతకీ ఆ రెమెడీ ఏంటో ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో ఒక కప్పు బాదం పప్పులు వేసి లైట్ గా వేయించుకోవాలి.అదే పాన్ లో ఒక కప్పు వాల్ నట్స్ వేసి వేయించుకోవాలి.

ఇప్పుడు ఒక నిమ్మ పండును తీసుకొని ఉప్పు నీటిలో శుభ్రంగా కడగాలి.ఇలా కడిగిన నిమ్మ పండును చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

Telugu Pain, Pain Remedy, Tips, Remedy, Latest-Telugu Health Tips

ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో బాదం పప్పులు, వాల్ నట్స్, ఒక కప్పు నల్ల ఎండు ద్రాక్ష వేసుకోవాలి.అలాగే కట్ చేసి పెట్టుకున్న నిమ్మ పండు ముక్కలు, ఒక కప్పు తేనె వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక గ్లాస్ జార్ లో నింపుకుని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని వన్ టేబుల్ స్పూన్ చొప్పున రోజూ ఉదయాన్నే తీసుకోవాలి.

ఇలా ప్రతి రోజు కనుక చేస్తే నడుము నొప్పి క్రమంగా దూరం అవుతుంది.అలాగే ఎముకలు కండరాలు దృఢంగా మారతాయి.

జాయింట్ పెయిన్స్ ఏమైనా ఉన్నా తగ్గుముఖం పడతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube