చలిని కూడా తరిమికొట్టే పరికరం వుంటుందా అని ఆలోచిస్తున్నారా? మనవాళ్ళు దేనిని వదిలిపెట్టారు కనుక.మనిషి మేధస్సు అపరిమితం.
తన సౌకర్యంకోసం సగటు మనిషి ఏదైనా చేయగలడు.కొంతమంది ఔత్సాహికులు మనుషుల అవసరాలు తెలుసుకొని వాటికి అవసరమైన ఎలక్ట్రానిక్ పరికరాలను తయారు చేస్తున్నాడు.
పెరుతున్న టక్నాలజీ మనిషి మేధో సంపత్తికి ఎంతగానో సహకరిస్తోంది.ఈ క్రమంలోనే చలిని తరిమికొట్టే సరికొత్త పరికరాన్ని కనిపెట్టారు.
దానినే సోలో స్టన్ టవర్ అంటారు.
కాగా ‘సోలో స్టవ్ టవర్’ ఇపుడు సోషల్ మీడియాలో ట్రాండ్ కావడం విశేషం.
సోషల్ మీడియా విస్తరిస్తున్న తరువాత ఇలాంటి కొత్తకొత్త ఐడియాలను నెటిజన్లు బాగా ప్రోత్సహిస్తున్నారు.ఇది సిటీల్లో వున్న జనాలకి ఎంతగానో ఉపయోగపడుతుందని అభిప్రాయపడుతున్నారు.సోలో స్టవ్ టవర్ అనేది ఒక ఔట్‌డోర్ హీటర్.చలికాలంలో ఆరుబయట పిక్నిక్లు వంటివి జరుపుకోవాలంటే, వణికించే చలి దాదాపు అందరినీ భయపెడుతుంది.
బయట పిక్నిక్ లకు వెళ్ళడానికి అందుకే జంకుతారు.ఇటువంటి తరుణంలో ‘సోలో స్టవ్ టవర్’ జనులకు అందుబాటులోకి వచ్చింది.
అవును, ఈ ‘సోలో స్టవ్ టవర్’ వెంట ఉంటే ఆరు బయట చలి భయమే మీకు అక్కర్లేదు.

ఎక్కడికైనా దీనిని తేలికగా తీసుకెళ్లే వెసులుబాటు కలదు.ఆరుబయట మీరు ఎపుడైనా పిక్నిక్ వంటి పార్టీలు చేసుకునే చోట దీనిని వెలిగించుకుంటే చాలు, నిమిషాల్లోనే పరిసరాలను వెచ్చగా మారుస్తుంది.వెలిగించిన 3 నిమిషాల్లోనే పదడుగుల వ్యాసార్ధం పరిధిలోని పరిసరాలను వెచ్చబరచడం దీని ప్రత్యేకత.
దీనిలోకి ఇంధనంగా కలప పొట్టుతో తయారైన ‘వుడెన్ పెల్లెట్స్’ వాడాల్సి ఉంటుంది.అమెరికన్ కంపెనీ ‘సోలో స్టవ్’ ఈ టవర్ హీటర్‌ను ఇటీవల మార్కెట్లోకి తీసుకు వచ్చింది.దీని ధర 1000 డాలర్లు, అంటే మన కరెన్సీలో రూ.82 వేలు మాత్రమే!
.






