టాలీవుడ్ ఇండస్ట్రీలో అటు ప్రభాస్ కు( Prabhas ) ఇటు పవన్ కళ్యాణ్ కు( Pawan Kalyan ) ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది.ఈ ఇద్దరు హీరోలు నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుంటూ సత్తా చాటుతున్నారు.
అయితే స్టార్ డైరెక్టర్ సుజీత్( Director Sujeeth ) పవన్ కళ్యాణ్, ప్రభాస్ కాంబినేషన్ లో సినిమా ప్లాన్ చేస్తున్నారని సమాచారం అందుతోంది.ఈ కాంబినేషన్ లో సినిమా ప్లాన్ చేస్తే మాత్రం సుజీత్ మరిన్ని సంచలనాలు సృష్టించే అవకాశం ఉంటుంది.
సుజీత్ ఓజీ సినిమా( OG Movie ) ప్రమోషన్స్ లో భాగంగా మాట్లాడుతూ ఈ కాంబినేషన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఈ కాంబినేషన్ లో సినిమా ఊహిస్తేనే ఓ రేంజ్ లో ఉంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
సుజీత్ ప్రభాస్ తో సాహో( Saaho Movie ) సినిమా, పవన్ తో ఓజీ సినిమా తెరకెక్కించిన సంగతి తెలిసిందే.ప్రభాస్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా మూవీ ప్లాన్ చేస్తే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

పవన్ కళ్యాణ్, ప్రభాస్ కథల ఎంపికలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్న నేపథ్యంలో ఈ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కించడం సులువు కాదు.స్టార్ హీరో ప్రభాస్ మల్టీస్టారర్ సినిమాలపై పెద్దగా ఆసక్తి చూపడం లేదనే టాక్ ఉంది.ఈ టాక్ విషయంలో సైతం నిజానిజాలు తెలియాల్సి ఉంది.ప్రభాస్ కల్కి( Kalki ) రిలీజ్ కు నెల రోజుల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది.

పవన్ ఓజీ కూడా ఈ ఏడాదే థియేటర్లలో విడుదల కానుంది.ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతుండగా ఈ సినిమా ఇండస్ట్రీ వర్గాలను షేక్ చేసే మూవీ అవుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.పవన్ కళ్యాణ్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.పవన్ క్రేజ్ ఊహించని స్థాయిలో ఉందనే సంగతి తెలిసిందే.