ఏపీ సీఎస్ ను తొలగించాలని సీఈసీకి టీడీపీ నేత కనకమేడల రవీంద్ర కుమార్ లేఖ..!!

తెలుగుదేశం పార్టీ నేత కనకమేడల రవీంద్ర కుమార్( Kanakamedala Ravindra Kumar ) కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ కు లేఖ రాశారు.సిఎస్ జవహర్ రెడ్డిని( CS Jawahar Reddy ) తొలగించి ఆయనపై సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు.

 Tdp Leader Kanakamedala Ravindra Kumar Letter To Cec To Remove Ap Cs Details, T-TeluguStop.com

పెద్ద ఎత్తున ప్రభుత్వ అసైన్డ్ భూములను కొనుగోలు చేశారని జవహర్ రెడ్డి పై సంచలన ఆరోపణలు చేశారు.తన కుమారుడు మరియు బినామీల పేరిట సీఎస్ భూములు కొన్నారని వివరించారు.

ఆ విధంగా సీఎస్ ఎనిమిది వందల ఎకరాలు కొనుగోలు చేశారని లేఖలో కనకమేడల స్పష్టం చేశారు.ఇప్పుడు ఆ భూముల రిజిస్ట్రేషన్ కోసం అధికారులను ప్రభావితం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

అంతేకాకుండా అధికార యంత్రాంగాన్ని తన అధికారులను దుర్వినియోగం చేశారని తెలిపారు.ఎన్నికల నియమావళి ఉల్లంఘించారని ఆరోపించారు.ఈ పరిస్థితులలో కౌంటింగ్ సజావుగా జరుగుతుందా.? అంటూ అనుమానం వ్యక్తం చేశారు.సిఎస్ జవహర్ రెడ్డిని తొలగించి సిబిఐ విచారణకు( CBI Enquiry ) ఆదేశాలు జారీ చేయాలని సీఈసీని కనకమేడల లేఖలో కోరడం జరిగింది.జూన్ 4వ తారీఖు ఓట్ల లెక్కింపు( Votes Counting ) ప్రక్రియ మొదలుకానుంది.

పోలింగ్ అనంతరం చాలాచోట్ల హింసాత్మకమైన ఘటనలు చోటుచేసుకున్నాయి.దీంతో ఓట్ల లెక్కింపు విషయంలో ప్రధాన పార్టీలు.

పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘానికి( CEC ) లేఖలు రాస్తున్నాయి.తాజాగా తెలుగుదేశం నాయకులు సీఎస్ జవహర్ రెడ్డి వ్యవహారంపై సీఈసీకి లేఖ రాయడం సంచలనంగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube