బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత( MLC Kavitha ) బెయిల్ పిటిషన్ పై ఇవాళ ఢిల్లీ హైకోర్టులో( Delhi High Court ) విచారణ జరగనుంది.ఈ మేరకు కవిత బెయిల్ పిటిషన్ పై సీబీఐ సమాధానం ఇవ్వనుంది.
అయితే ట్రయల్ కోర్టు తీర్పును ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో( Delhi liquor scam case ) ఈడీ అరెస్ట్ తరువాత కవితను సీబీఐ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
కేసులో తన ప్రమేయం లేదని, కక్షపూరితంగా తనను ఇరికించారని కవిత పేర్కొంటున్నారు.ఈ క్రమంలోనే లిక్కర్ స్కాం కేసులో బెయిల్ ఇవ్వాలని కోరుతూ పిటిషన్లు దాఖలు చేశారు.
ఈ పిటిషన్లను ట్రయల్ కోర్టు డిస్మిస్ చేయగా.ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.
ఈ నేపథ్యంలో కవిత బెయిల్ పిటిషన్ విచారణపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.