బెయిల్ పొడిగించాలంటూ సుప్రీంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పిటిషన్..!!

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్( Arvind Kejriwal ) సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ మేరకు వారం రోజులపాటు మధ్యంతర బెయిల్ ను పొడిగించాలని కోరుతూ పిటిషన్ వేశారు.

 Delhi Cm Kejriwal's Petition In Supreme Court To Extend Bail , Supreme Court , D-TeluguStop.com

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మనీలాండరింగ్ ఆరోపణల నేపథ్యంలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.అయితే లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడిగా ప్రచారాన్ని నిర్వహించుకునేందుకు గానూ ఆయనకు సుప్రీం ధర్మాసనం మధ్యంతర బెయిల్ ను మంజూరు చేసింది.

ఈ క్రమంలో వచ్చే నెల ఒకటో తేదీ వరకు మధ్యంతర బెయిల్ ఇచ్చిన న్యాయస్థానం 2న తిరిగి జైలుకు వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది.అయితే ప్రస్తుతం అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నానన్న కేజ్రీవాల్ మరో ఏడు రోజుల పాటు బెయిల్ పొడిగించాలని పిటిషన్ దాఖలు చేశారు.

కాగా కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీం ధర్మాసనం ఏ విధంగా స్పందిస్తుందనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube