జూన్ 4వ తారీకు ఏపీ ఎన్నికల ఫలితాలు( AP Elections Result ) వెలువడనున్నాయి.ఈసారి ఎవరు గెలుస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది.
ఈ ఎలక్షన్ లో రూరల్ ప్రాంత ప్రజలు మరియు మహిళలు అధిక సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.దీంతో వైసీపీ( YCP ) వర్సెస్ తెలుగుదేశం పార్టీ కూటమి( TDP Alliance ) మధ్య పోటీ నెలకొంది.
ఈ క్రమంలో వచ్చే వారంలోనే ఫలితాలు రాబోతున్న నేపథ్యంలో రకరకాల వార్తలు వస్తున్నాయి.కూటమి అధికారంలోకి వస్తే జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ముఖ్యమంత్రి కాబోతున్నారని డిప్యూటీ సీఎంగా చంద్రబాబు( Chandrababu ) వ్యవహరిస్తారని ప్రచారం జరుగుతుంది.
ఈ క్రమంలో జనసేన సీనియర్ నేత కొణతాల రామకృష్ణ( Konathala Ramakrishna ) క్లారిటీ ఇవ్వటం జరిగింది.కూటమి అధికారంలోకి వస్తే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబే అని స్పష్టం చేశారు.చంద్రబాబు పరిపాలన అనుభవం కలిగిన వ్యక్తి అని పేర్కొన్నారు.ఎలక్షన్ కి సంబంధించి బీజేపీ… టీడీపీ పార్టీలను కలపడంలో జనసేన సఫలీకృతమైందన్నారు.వైసీపీ ప్రభుత్వంలో ఉత్తరాంధ్ర అభివృద్ధి పూర్తిగా వెనుకబడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.వంశధార, సుజల స్రవంతి ప్రాజెక్టు పెండింగ్ లోనే ఉన్నాయన్నారు.
తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిన ప్రాజెక్టుల నైన సీఎం జగన్ పూర్తి చేయలేకపోయారని విమర్శించారు.ఉత్తరాంధ్రలో చాలా కుటుంబాలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తాయి.
ప్రతి ఎకరాకు నీళ్లు రావాలంటే ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి కావాల్సిన అవసరం ఉందని కొణతాల రామకృష్ణ వ్యాఖ్యానించారు.