హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్, హత్య ఘటన తీవ్ర కలకలం సృష్టించింది.మేడ్చల్ జిల్లాలోని చింతల్ కు చెందిన బిల్డర్ మధు( Builder Madhu ) ఈ నెల 24వ తేదీన అదృశ్యమైన సంగతి తెలిసిందే.
తాజాగా మధు మృతదేహాం బీదర్ సమీపంలో లభ్యమైంది.ఈ క్రమంలో మధును కిడ్నాప్ చేసిన గుర్తు తెలియని దుండగులు హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తించారు.మధు దగ్గర ఉన్న రూ.5 లక్షల నగదుతో పాటు బంగారు ఆభరణాలు మాయమైనట్లు పోలీసులు గుర్తించారు.ఈ క్రమంలోనే ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు.