అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో( Maredumilli Ghat Road ) భారీ లారీ నిలిచిపోయింది.గత అర్ధరాత్రి ఘాట్ రోడ్డులోని మూలమలుపు వద్ద లాంగ్ ఛాస్ లారీ ఆగిపోయింది.
రోడ్డుకు అడ్డంగా భారీ లారీ నిలిచిపోవడంతో ఇతర వాహనాలు అన్ని ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.గత అర్ధరాత్రి నుంచి ఇదే పరిస్థితి ఉండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఈ క్రమంలోనే తిండి, నీరు లేక మహిళలు, చిన్నారులు అవస్థలకు గురవుతున్నారు.ప్రస్తుతం ఘటనాస్థలానికి చేరుకున్న అధికారులు లారీని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు.