మారుతున్న లైఫ్ స్టైల్ తో మనిషికి నిద్ర చాలా కరువవుతుంది.ముఖ్యంగా మహిళలకు కంటినిండా కునుకు లేకుండా చేస్తుంది.
నిద్రలేమితో బాధపడే మహిళలు ఆరోగ్యపరమైన అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.నిద్ర సంబంధమైన సమస్యలు వచ్చే ముప్పు మహిళలలో ఎక్కువగా ఉంటుందని అమెరికాకు చెందిన మెడికల్ యూనివర్సిటీ అధ్యయనంలో తేలింది.
మరి ఆ సమస్య ఏంటో తెలుసుకుందాం.
నిద్రలేమి కారణంగా రోజువారీ ఎదురయ్యే ఒత్తిడిని కూడా తట్టుకోలేని పరిస్థితుల్లోకి వెళ్తారు.
దీని వల్ల ఎలాంటి పనులు చేయడానికి ఆసక్తి చూపించారు.దీర్ఘకాలికంగా నిద్రలేమి సమస్యతో బాధపడే వారిలో జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, సమస్యలను పరిష్కరించే నేర్పు తగ్గిపోవడం, అధిక రక్తపోటు, గుండెపోటు మొదలైనటువంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
జనాభాలో మూడోవంతు నిద్ర పరమైన సమస్యలతో బాధపడుతున్నారు.అయితే ఆ సమస్య మహిళల్లో మరింత ఎక్కువగా ఉంటుంది.మహిళలలో నిద్రలేమి సమస్య పురుషులతో పోలిస్తే రెండింతలు అధికంగా ఉంటుంది.ఇంట్లో బయట పని ఒత్తిడి వల్ల మహిళలకు నిద్రలేకుండా చేస్తుంది.
మానసిక ఒత్తిడికి సరిపడు వ్యాయామాలు చేయడం లేదు దీనికి తోడు వారి తిండి కూడా నిద్రపై ప్రభావం పడుతుంది.
సాధారణంగా మహిళలు రాత్రిపూట 7 గంటలు నిద్ర పోవాలి.
అదే గర్భిణీ స్త్రీలయితే దాదాపు తొమ్మిది గంటలు నిద్రపోవాలి.నిద్ర లేకపోవడం వల్ల మహిళల ఎముకలపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
దీని వల్ల మహిళల్లో చురుకుదనం తగ్గిపోయి బలహీన పడతారు.సరైన నిద్రలేకపోవడం వల్ల ఎముకలలో ఖనిజ సాంద్రత తగ్గుతుంది.
దీనివల్ల ఎముకలు బలహీనపడి విరుగుతాయి.