Actress Padma : యండమూరి వీరేంద్రనాథ్ వల్ల నా జీవితం నాశనం అయ్యింది: పద్మ

సినిమా ప్రపంచం పైకి మాత్రం అందంగానే కనిపిస్తుంది, లోపలికి వెళ్తేనే అందులోని చీకటి కోణాలు ఎన్నో బయటపడతాయి.క్యాస్టింగ్ కౌచ్ నుంచి ఇతరులను తొక్కేసే రాజకీయాల వరకు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో దారుణాలు చోటు చేసుకుంటాయి.

 Kukka Padma Comments On Yendamuri Verendranath-TeluguStop.com

అలాంటి సినీ రాజకీయాలకు తాను బలైపోయానని ప్రముఖ నటి పద్మ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది.ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన నటి పద్మ( Actress Padma ) ప్రముఖ సినిమా రచయిత యండమూరి వీరేంద్రనాథ్ పై సంచలన ఆరోపణలు చేసింది.

కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్న సమయంలో తన వద్దకు వచ్చి రెండో పెళ్లి చేసుకుంటావా? అని వీరేంద్రనాథ్ అడిగాడని, అందుకు తాను నిరాకరించడంతో అవకాశాలు రాకుండా చేశాడని ఆమె చెప్పుకొచ్చింది.1986 వరకు తాను మొండిఘటం, కుక్క వంటి చాలా సినిమాల్లో నటించానని కానీ ఆ తర్వాత ఒక్క అవకాశం కూడా రానివ్వకుండా సినిమా ఇండస్ట్రీ నుంచి తనని యండమూరి వీరేంద్రనాథ్( Yandamuri Virendranath ) బయటికి వెళ్ళగొట్టాడని ఆరోపణలు చేస్తూ ఎమోషనల్ అయ్యింది.

Telugu Actress Padma, Kukka Padma, Kukkapadma, Suribabu-Telugu Stop Exclusive To

తాను ఒక పిచ్చిదానినని ఇండస్ట్రీలో యండమూరి వీరేంద్రనాథ్ చిత్రీకరించాడని, చివరకు ఒక్క ఆఫర్ కూడా రాలేదని ఆమె కంటతడి పెట్టుకుంది.ఈ విషయం తెలిసిన తర్వాత తండ్రి నచ్చజెప్పి సూరిబాబు( Suribabu ) అనే వ్యక్తితో తన పెళ్లి చేశాడు అని పేర్కొంది.సూరిబాబుకు ఆల్రెడీ పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్నారన్న సంగతి తర్వాత తెలిసి ఎంతో మానసిక క్షోభకు గురయ్యానని పేర్కొంది.ఆపై విడాకులు తీసుకున్నానని వెల్లడించింది.

Telugu Actress Padma, Kukka Padma, Kukkapadma, Suribabu-Telugu Stop Exclusive To

నటి పద్మ ఇంకా మాట్లాడుతూ తన తండ్రి ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ అని చెప్పింది.సినిమాల్లో అవకాశాలు వచ్చినా కూడా పెద్దగా డబ్బులు రాకపోయాయని తెలిపింది.అందువల్ల తండ్రి డబ్బులు పైనే ఆధారపడాల్సి వచ్చేదని వెల్లడించింది.తండ్రి తో పాటు కుటుంబ సభ్యులందరూ చనిపోవడంతో ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నానని తెలిపింది.తనకు సినిమాల్లో డబ్బింగ్ చెప్పుకునే అవకాశాల్ని కూడా రానివ్వకుండా యండమూరి వీరేంద్రనాథ్ ఇప్పటికీ ఆపుతున్నాడని ఆమె కామెంట్స్ చేసింది.మరి దీనిపై వీరేంద్రనాథ్ స్పందిస్తాడా లేదా అనేది చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube