బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్( RS Praveen Kumar ) కీలక వ్యాఖ్యలు చేశారు.శ్రీధర్ రెడ్డి ( Sridhar Reddy ) హత్యపై సమగ్ర విచారణ జరిపించాలని రాష్ట్ర డీజీపీని కోరినట్లు తెలిపారు.
హత్య జరిగి నాలుగు రోజులు అవుతున్నా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు.
ఈ క్రమంలోనే మంత్రి జూపల్లి కృష్ణారావుపై( Minister Jupalli Krishnarao ) ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.
ఈ కేసులో ఇప్పటివరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదని చెప్పారు.ఈ నేపథ్యంలో కేసును ప్రత్యేక దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని కోరామని తెలిపారు.వారం రోజుల్లో న్యాయం జరగకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.