శ్రీధర్ రెడ్డి హత్యపై సమగ్ర విచారణ జరపాలి..: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
TeluguStop.com
బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్( RS Praveen Kumar ) కీలక వ్యాఖ్యలు చేశారు.
శ్రీధర్ రెడ్డి ( Sridhar Reddy ) హత్యపై సమగ్ర విచారణ జరిపించాలని రాష్ట్ర డీజీపీని కోరినట్లు తెలిపారు.
హత్య జరిగి నాలుగు రోజులు అవుతున్నా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు.
ఈ క్రమంలోనే మంత్రి జూపల్లి కృష్ణారావుపై( Minister Jupalli Krishnarao ) ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.
ఈ కేసులో ఇప్పటివరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదని చెప్పారు.ఈ నేపథ్యంలో కేసును ప్రత్యేక దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని కోరామని తెలిపారు.
వారం రోజుల్లో న్యాయం జరగకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
How Modern Technology Shapes The IGaming Experience