రాజమౌళిని నోరు మూసుకో అని కోప్పడిన వ్యక్తి ఆయనేనా.. అందుకే సీరియస్ అయ్యారా?

స్టార్ డైరెక్టర్ రాజమౌళి( Rajamouli ) ఒక్కో మెట్టు పైకి ఎదుగుతూ కెరీర్ పరంగా ఊహించని స్థాయిలో సక్సెస్ సాధిస్తున్నారు.రాజమౌళి గురించి నెగిటివ్ కామెంట్లు చేయడానికి ఎవరూ సాహసించరనే సంగతి తెలిసిందే.

 Sirivennela Seetharamashastry Comments About Rajamouli Details Here Goes Viral I-TeluguStop.com

సిరివెన్నెల సీతారామశాస్త్రి నోరు మూసుకో అంటూ తనపై కోప్పడ్డారని జక్కన్న చెప్పగా ఆ విషయాలు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి.

నా ఉచ్ఛ్వాసం కవనం అనే కార్యక్రమంలో భాగంగా సిరివెన్నెల సీతారామశాస్త్రి( Sirivennela Sitarama Shastri ) మాట్లాడుతూ ఈ కామెంట్లు చేశారు.

మా ఫ్యామిలీలో అందరికీ మా పెదనాన్నే పేర్లు పెట్టారని జక్కన్న వెల్లడించారు.నా పేరు శ్రీశైల శ్రీ రాజమౌళి అని మా పేర్లు వింటే చాలా గర్వంగా ఉంటుందని రాజమౌళి తెలిపారు.

నా కూతురికి సైతం ఇలాంటి పేరే పెట్టాలని అనుకున్నా దొరకలేదని జక్కన్న కామెంట్లు చేయడం గమనార్హం.

Telugu Mayukha, Rajamouli, Tollywood-Movie

నా కూతురికి కూడా ఇలాంటి పేరే పెట్టాలని అనుకుని మయూఖ( Mayukha ) అని పేరు పెట్టానని జక్కన్న అన్నారు.నాకు పద్మశ్రీ వచ్చిన సమయంలో పద్మశ్రీ తీసుకోవడానికి వెళ్లకూడదని అనుకున్నానని ఆయన కామెంట్లు చేశారు.ఆ విషయం సిరివెన్నెలకు చెబితే భారత ప్రభుత్వం నువ్వు పద్మశ్రీకి అర్హుడవని భావిస్తుంటే పురస్కారం తీసుకోవా అని తిట్టారని రాజమౌళి వెల్లడించడం గమనార్హం.

Telugu Mayukha, Rajamouli, Tollywood-Movie

అతి వేషాలు వేయొద్దని నోరు మూసుకుని వెళ్లు అని శాస్త్రిగారు కోపంగా చెప్పడంతో ఆ వేడుకకు వెళ్లి పురస్కారం తీసుకున్నానని జక్కన్న అన్నారు.మర్యాద రామన్నలోని పరుగులు తీయ్ పాట నాకు ఎంతో ఇష్టమని సిరివెన్నెల గారు ఆ పాట రాశారని జక్కన్న చెప్పుకొచ్చారు.మహేష్ జక్కన్న కాంబో మూవీపై సైతం అంచనాలు అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా షూటింగ్ కు సంబంధించిన అప్ డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube