సోనియా వస్తారో లేదో ? నేడు ఢిల్లీకి రేవంత్ 

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా కాంగ్రెస్ అగ్ర నేత సోనియాగాంధీ( Sonia Gandhi ) హాజరవుతారా లేదా అనే విషయంలో ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది.తెలంగాణ అవతరణ వేడుకలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం భారీగానే ఏర్పాట్లు చేస్తోంది.

 Revanth To Delhi Today Whether Sonia Will Come Or Not, Telangana Telangana Cm ,-TeluguStop.com

ఎంతమంది ప్రముఖులను ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా పిలవాలనే దానిపై ఒక క్లారిటీ కి రావాలి అని నిర్ణయించుకున్నారు.దీనిలో భాగంగానే తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని ముఖ్య అతిథిగా పిలిచి ఆమెకు ఘన సత్కారం చేయాలని నిర్ణయించుకున్నారు.

అయితే ఆమె రాకపై ఇంకా ఏ క్లారిటీ రావడం లేదు.ఇప్పటికే ఏఐసిసి నేతలతో తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి ( CM Revanth Reddy )తో ఫోన్ లో మాట్లాడినా.

సోనియా రాక విషయంలో ఏ క్లారిటీ రాకపోవడంతో ఈరోజు రాత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళనున్నారు .

Telugu Pcc, Priyanka Gandi, Rahul Gandi, Revanth Reddy, Revanthdelhi-Politics

ఢిల్లీకి( Delhi ) వెళ్లి సోనియా గాంధీతో భేటీ అయి,  ఆమెను వ్యక్తిగతంగా కలిసి ఆహ్వానించాలని రేవంత్ భావిస్తున్నారు.ప్రస్తుతం పంజాబ్ ఎన్నికల ప్రచారంలో ఉన్న ఉప ముఖ్యమంత్రి మల్లు విక్రమార్క కూడా సోనియా గాంధీతో రేవంత్ రెడ్డి భేటీ అయ్యే సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉందట.ఇప్పటికే కొంతమంది తెలంగాణ మంత్రులు ఢిల్లీకి వెళ్లే ఆలోచనలు ఉన్నారట .సోనియా గాంధీతో పాటు,  రాహుల్, ప్రియాంక గాంధీలను( Rahul, Priyanka Gandhi ) సైతం ఆహ్వానించాలని తెలంగాణ కాంగ్రెస్ నిర్ణయించుకుంది .తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తయిన సందర్భంగా సోనియాగాంధీని ఈ కార్యక్రమానికి ఆహ్వానించడంతో ప్రజలకు ఈ విషయంలో క్లారిటీ వస్తుందని రాష్ట్ర రాజకీయాల్లోను కీలక అంశంగా మారుతుందని అంచనా వేస్తున్నారు .అందుకే సోనియాగాంధీని ఈ కార్యక్రమానికి హాజరయ్యేలా చూసేందుకు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు.

Telugu Pcc, Priyanka Gandi, Rahul Gandi, Revanth Reddy, Revanthdelhi-Politics

తెలంగాణ అవతరణ ఉత్సవాల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం( Central Election Commission ) నుంచి అనుమతి లభించడంతో,  భారీ స్థాయిలోనే దీనిని నిర్వహించాలని భావిస్తున్నారు.ఇదే వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర గీతాన్ని  విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు.అందెశ్రీ రాసిన జయ జయహే తెలంగాణ పాట కంపోజింగ్ నాలుగు రోజుల క్రితమే రేవంత్ రెడ్డి పరిశీలించి కొన్ని సవరణలు సూచించారు .ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి మ్యూజిక్ తో వస్తున్న ఈ గీతాన్ని  వినేందుకు నిన్ననే రేవంత్ రెడ్డి రాయదుర్గంలోని స్టూడియో కు వెళ్లారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube