బెంగళూరు రేవ్ పార్టీ( Bangalore rave party ) కేసులో మరో ట్విస్ట్ నెలకొంది.పోలీసుల విచారణకు సినీ నటి హేమ( Film actress Hema ) డుమ్మా కొట్టిందని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే విచారణకు హాజరు అయ్యేందుకు సమయం కావాలని నటి హేమ పోలీసులను కోరారని సమాచారం.వైరల్ ఫీవర్ తో బాధపడుతున్న కారణంగా విచారణకు హాజరు కాలేనని నటి హేమ బెంగళూరు సీసీబీకి లేఖ రాశారని తెలుస్తోంది.
అయితే హేమ లేఖను సీసీబీ పరిగణనలోకి తీసుకోలేదు.ఈ నేపథ్యంలోనే హేమకు మరో నోటీస్ ఇచ్చేందుకు బెంగళూరు పోలీసులు సిద్ధం అయ్యారు.
అయితే బెంగళూరు లో నిర్వహించిన రేవ్ పార్టీలో హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారించిన పోలీసులు ఆమె ఇవాళ విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో ఆదేశించిన సంగతి తెలిసిందే.