అమెరికాలో లేఆఫ్స్ : 60 రోజుల నిబంధన .. వీసా బదిలీల దిశగా హెచ్ 1 బీ హోల్డర్స్ చూపు

ఆర్ధిక మాంద్యం దెబ్బకు అగ్రరాజ్యం అమెరికా( America ) వణుకుతోంది.ఆ దేశానికి చెందిన దిగ్గజ కంపెనీలు తమ ఉద్యోగులను తొలగిస్తున్న సంగతి తెలిసిందే.

 Laid Off H-1b Visa Holders Switch To Tourist And B-1 Or B-2 Visas Details, Laid-TeluguStop.com

అమెరికాలో ఉద్యోగాలు కోల్పోతున్న విదేశీ కార్మికుల్లో భారతీయులు కూడా వున్నారు.గూగుల్ , మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి కంపెనీలలో లే ఆఫ్‌ల కారణంగా భారతీయులు( Indians ) పెద్ద సంఖ్యలో ఉద్యోగాలను కోల్పోతున్నారు.

అమెరికాలో ఉద్యోగం కోల్పోయిన విదేశీ ఐటీ నిపుణుల్లో 30 నుంచి 40 శాతం మంది భారతీయులేనని నివేదికలు చెబుతున్నాయి.

వీరిలో చాలా మంది హెచ్ 1బీ, ఎల్ 1 వీసాలపై వున్నవారేనని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి.

మరోవైపు.ఉద్యోగం పోయిందన్న బాధ కంటే హెచ్1బీపై( H-1B ) వున్న వారికి 60 రోజుల నిబంధన కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.

హెచ్ 1 బీ వీసాతో అమెరికాలో వుంటున్న విదేశీ ఉద్యోగులు . తమ ఉద్యోగం కోల్పోయిన 60 రోజుల్లోగా మరో ఉద్యోగంలో చేరాల్సి వుంటుంది.లేనిపక్షంలో అట్టివారు అమెరికాలో ఉండటానికి అనర్హులు.ఈ నేపథ్యంలో ఉద్యోగాలు( Jobs ) కోల్పోయిన వారు తీవ్ర ఆందోళనలో వున్నారు.అయితే అమెరికాను విడిచి వెళ్లకుండా ఉండేందుకు బాధితులు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు.మెజారిటీ మంది వీసా బదిలీపై( Visa Transitions ) మొగ్గుచూపుతున్నారు.

Telugu America, Visa, Visa Holders, Immigrant, Indian, Laid, Tourist Visa, Layof

హెచ్ 1 బీ వీసాను బీ-1,( B-1 ) బీ-2కి( B-2 ) మార్చిన తర్వాత వలసదారులు అమెరికాలో 6 నెలలు అదనంగా ఉండవచ్చు.అలాంటి వ్యక్తులు గడువులోగా తమ దేశానికి తిరిగి వెళ్లాలనే ఒత్తిడి లేకుండా ఉద్యోగాన్ని వెతుక్కోవచ్చు.వీసా బదిలీలలో స్టూడెంట్ స్టేటస్ (ఎఫ్ 1), విజిటర్ స్టేటస్ (బీ-1 లేదా బీ-2)ఉన్నాయి.ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఒక వలసదారుడు బీ-1 లేదా బీ-2 స్టేటస్‌కు మారినప్పుడు .వారు తమ హెచ్ – 1 బీ వీసా స్థితిని తిరిగి పొందేవరకు పనిచేయడానికి అనర్హులు.అయితే వారు ఉద్యోగాలను అన్వేషించవచ్చు.

Telugu America, Visa, Visa Holders, Immigrant, Indian, Laid, Tourist Visa, Layof

కాగా.60 రోజులలోపు దేశం విడిచి వెళ్లడం తప్పించి వేరే మార్గం లేదని భావిస్తున్న వారికి యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్‌సీఐఎస్) కీలక మార్గదర్శకాలు జారీ చేసింది.దీని ప్రకారం ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా బాధితులు 60 రోజుల గ్రేస్ పీరియడ్‌కు మించి అమెరికాలో వుండవచ్చు.

యూఎస్‌సీఐఎస్ మార్గదర్శకాలు :

1.నాన్ ఇమ్మిగ్రెంట్ స్టేటస్‌ను మార్చాలని కోరుతూ దరఖాస్తు దాఖలు చేయడం
2.స్టేటస్ సర్దుబాటు కోరుతూ దరఖాస్తు దాఖలు చేయడం
3.బలవంతపు పరిస్ధితుల ఎంప్లాయ్‌మెంట్ అథరైజేషన్ డాక్యుమెంట్ కోసం దరఖాస్తు చేయడం.లేదా
4.యజమానిని మార్చడానికి ‘‘ nonfrivolous petition ’’ లబ్ధిదారుగా వుండటం

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube