ప్రభాస్ కల్కి సినిమా( Kalki movie ) రిలీజ్ కి రెడీ అవుతున్న నేపథ్యంలో ఈ సినిమా మీద ఇప్పటికే ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి.అయితే రీసెంట్ గా ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా మీద ఉన్న అంచనాలు ఒక్కసారిగా తారాస్థాయిలోకి వెళ్లిపోయాయి.
ఇక మొత్తానికైతే ఈ సినిమాతో ప్రభాస్ ఒక భారీ సక్సెస్ ని అందుకోబోతున్నాడు అనే క్లారిటీ అయితే అందరికీ వచ్చింది.మరి ఈ సినిమా ఎలా ఉండబోతుంది.

అంటూ గత కొన్ని రోజులుగా వస్తున్న వార్తలకి ఈ ట్రైలర్ చెక్ పెట్టినట్టుగా తెలుస్తుంది.ఇక మొత్తానికైతే ఈ సినిమా బాలీవుడ్( Bollywood ) హీరోలకి మరోసారి కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది.ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన రెండో ట్రైలర్ ని కూడా రిలీజ్ చేసే పనిలో మేకర్స్ బిజీగా ఉన్నట్టుగా తెలుస్తుంది.అయితే రెండో ట్రైలర్ ని సినిమా రిలీజ్ కి నాలుగు రోజులు ముందు అంటే జూన్ 23వ తేదీన ఈ సినిమా రెండో ట్రైలర్ ని రిలీజ్ చేసే ఆలోచనలో మేకర్స్ అయితే ఉన్నారు.
మరి మొదటి ట్రైలర్ కంటే కూడా ఇది చాలా బీభత్సం గా ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది.

ఇక సినిమా రిలీజ్ అవ్వడానికి ముందు వస్తుంది కాబట్టి రెండో ట్రైలర్ ఒక ప్రభంజనాన్ని సృష్టించే విధంగా ఉండబోతుందనే వార్తలైతే వినిపిస్తున్నాయి.చూడాలి మరి ఈ సినిమాతో ప్రభాస్ ఎలాంటి ప్రభంజనాలను క్రియేట్ చేస్తాడు అనేది…ఇక నాగ్ అశ్విన్( Nag Ashwin ) కూడా భారీ రేంజ్ లోనే ఈ సినిమా కోసం కష్టపడ్డాడు.కాబట్టి తనకి కూడా చాలా మంచి క్రెడిట్ అయితే దక్కబోతున్నట్టుగా తెలుస్తుంది…ఇక ప్రొడ్యూసర్ అశ్వినీదత్ ఈ సినిమా కోసం దాదాపు 600 కోట్లు పెట్టాడు కాబట్టి ఆయనకి ఈ సినిమా డబుల్ కలెక్షన్స్ ను సంపాదించి పెట్టబోతున్నట్టుగా తెలుస్తుంది…
.







