ప్రొడ్యూసర్లను పెళ్లి చేసుకున్న టాప్ యాక్ట్రెస్ లు వీరే...??

సాధారణంగా సినిమాల్లో నటించే యాక్ట్రెస్‌లు దర్శకులను లేదంటే హీరోలను పెళ్లి చేసుకుంటారు.కొంతమంది మాత్రం నిర్మాతలను పెళ్లి చేసుకుని ఆశ్చర్యపరిచారు.

 Heroines Who Married Producers Sridevi Sonali Bendre Raveena Tandon Divya Bharti-TeluguStop.com

వారిలో శ్రీదేవి, సోనాలి బింద్రే వంటి వారు కూడా ఉన్నారు.వారు ఏ నిర్మాతలను పెళ్లి చేసుకున్నారో తెలుసుకుందాం.

అనేక తెలుగు, హిందీ సినిమాల్లో నటించి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న దివ్య భారతి( Divya Bharati ) కెరీర్ పిక్ స్టేజ్ లో ఉన్నప్పుడే చనిపోయింది.ప్రతిభ, అందంతో భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణులలో ఒకరిగా అవతరించింది.

దివ్య భారతి ఒక సినిమా సెట్‌లో సాజిద్ నడియాడ్‌వాలా( Sajid Nadiadwala ) అనే సినీ నిర్మాతతో పరిచయం పెంచుకుంది.వారు 1992లో ఒక ప్రైవేట్ వేడుకలో వివాహం చేసుకున్నారు.

కొద్దిమంది సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు.సినీ కెరీర్‌పై ప్రభావం పడకుండా ఉండేందుకు వారు వివాహాన్ని సీక్రెట్ గా ఉంచారు.

అయితే మ్యారేజ్ అయిన ఒక్క సంవత్సరానికే ఈమె చనిపోయింది అప్పటికి ఆమె వయసు కేవలం 19 ఏళ్లు.

Telugu Anil Thadani, Boney Kapoor, Divya Bharti, Goldie Behl, Raveena Tandon, So

అతిలోక సుందరి శ్రీదేవి( Sridevi ) టాలీవుడ్ హీరోలలో ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకుంటుందని చాలామంది అనుకున్నారు కానీ ఆమె ఆల్రెడీ పెళ్లయిన బోనీ కపూర్ తో( Boney Kapoor ) లవ్ లో పడింది 1996లో అతడిని పెళ్లి చేసుకుంది బోనీ కపూర్ హిందీలో ప్రముఖ నిర్మాతగా రాణిస్తున్నాడు.అయితే శ్రీదేవి 54 సంవత్సరాల్లోనే బాత్ టబ్ ప్రమాదంలో చనిపోయింది.శ్రీదేవి మరణాన్ని ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోతున్నారు.

శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ బాలీవుడ్ సినిమాల్లో నటిస్తూ అలరిస్తోంది.దేవర సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో కూడా అడుగుపెట్టే ఛాన్స్ ఉంది.

Telugu Anil Thadani, Boney Kapoor, Divya Bharti, Goldie Behl, Raveena Tandon, So

సోనాలి బింద్రే( Sonali Bendre ) నారాజ్ మూవీ సెట్స్‌లో ప్రొడ్యూసర్ గోల్డీ బెల్‌తో( Goldie Behl ) పరిచయం పెంచుకుంది.అతడు చిత్రనిర్మాత రమేష్ బెహ్ల్ కుమారుడు.సోనాలి, గోల్డీ 2002లో వివాహం చేసుకున్నారు.వీరికి 2005లో ఒక కుమారుడు జన్మించాడు.సోనాలి మురారి, ఇంద్ర, ఖడ్గం, మన్మధుడు సినిమాలతో తెలుగు సినిమా పరిశ్రమలో చాలా పాపులర్ అయ్యింది.

రవీనా టాండన్( Raveena Tandon ) ఒక సినిమా చేస్తున్నప్పుడు ఫిలిం డిస్ట్రిబ్యూటర్ అనిల్ తడానితో( Anil Thadani ) డేటింగ్ ప్రారంభించింది.2003లో నిశ్చితార్థం చేసుకుని 2004లో ఉదయపూర్‌లో పెళ్లి చేసుకుంది.ఈ దంపతులకు 2005లో రాషా అనే కుమార్తె, 2008లో రణబీర్‌వర్ధన్ అనే కుమారుడు జన్మించారు.

రవీనా కేజీఎఫ్ సినిమా ద్వారా భారతదేశ వ్యాప్తంగా ఫుల్ పాపులర్ అయింది.ఈ ముద్దుగుమ్మ ఏ పాత్రలో నటించిన అది సూపర్ హిట్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube