ఓటమి బాధ : ఓడిన వైసీపీ నేతలు దుకాణం సర్దేశారా ? 

ఏపీలో జరిగిన సార్వత్రిక  ఎన్నికల్లో వైసీపీ( YCP ) ఓటమి చెందడాన్ని ఇప్పటికీ ఆ పార్టీ నేతలు ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు.175 అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు పోటీ చేయగా,  కేవలం 11 స్థానాల్లో మాత్రమే గెలిచారు.అలాగే 25 పార్లమెంట్ నియోజకవర్గలకు గాను నాలుగు స్థానాల్లోనే విజయం సాధించారు.ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి వైసీపీ నేతలు పూర్తిగా పడ్డారు దీంతో వైసిపి లోని కీలక నాయకులు చాలామంది సైలెంట్ అయిపోయారు పార్టీ నాయకులు కార్యకర్తలకు అందుబాటులోకి రావడం లేదు.

 Are The Defeated Ycp Leaders Shop Stewards, Ysrcp, Telugudesam, Tdp, Janasena, Y-TeluguStop.com

ముఖ్యంగా ఈ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందిన అభ్యర్థులు నియోజకవర్గాలకు దూరంగా ఉంటున్నారు.ఎక్కడకు వెళ్లారు .ఎందుకు వెళ్లారో తెలియకపోవడం,  ఫోన్ లు కూడా స్విచ్ ఆఫ్ చేసుకోవడంతో నియోజకవర్గంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఓడిన ఎమ్మెల్యే అభ్యర్థుల కార్యాలయాల చుట్టూ తిరుగుతూ వారి కోసం ఆరా తీస్తున్నారు.

Telugu Ap, Janasena, Telugudesam, Ys Jagan, Ysrcp-Politics

ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందిన అభ్యర్థులు ఎక్కువమంది హైదరాబాద్ బెంగళూర్( Hyderabad Bangalore ) లలో ఉన్నట్లు తెలుస్తోంది.అక్కడే వారికి వివిధ వ్యాపార వ్యవహారాలు ఉండడం,  వారి కుటుంబ సభ్యులు అక్కడే ఉండడంతో నియోజకవర్గలకు దూరంగా ఉంటున్నారట.ఏపీలో మే 13 న పోలింగ్ జరిగింది .జూన్ 4న ఫలితాలు వెలుపడ్డాయి అప్పటి వరకు ప్రచారంలో తీరిక లేకుండా గడిపిన నాయకులు కొద్దిరోజుల పాటు కుటుంబ సమేతంగా సేద తీరేందుకు ఇతర ప్రాంతాలకు వెళ్లి వచ్చారు.కొంతమంది విదేశాలకు వెళ్లి రాగా,  మరి కొంత మంది పర్యాటక ప్రాంతాలకు కుటుంబ సభ్యులతో వెళ్లి కౌంటింగ్ కు ముందే తిరిగి వచ్చారు.

Telugu Ap, Janasena, Telugudesam, Ys Jagan, Ysrcp-Politics

 ఇక ఫలితాలు ముగిసిన తరువాత ఓటమి బాధను తట్టుకోలేక చాలామంది నియోజకవర్గాలకు దూరంగా హైదరాబాద్,  బెంగళూరు తదితర ప్రాంతాలకు వెళ్లిపోయి ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ చేసుకున్నారట.కార్యకర్తలకు అందుబాటులో లేకుండా  ఫోన్ లు కూడా స్విచ్ ఆఫ్ చేసుకోవడం పై కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  కొంతమంది రాష్ట్ర స్థాయి నాయకులకు ఈ వ్యవహారాలపై ఫిర్యాదులు చేస్తున్నారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube