సాధారణంగా కొన్ని సినిమాల్లో పాటలు 10 నిమిషాల్లోనే స్టార్ట్ అవుతాయి మరికొన్ని సినిమాల్లో మిడిల్ లో వస్తాయి ఇంకొన్ని సినిమాల్లో చివర్లో పాటలనేవి ఉంటాయి కానీ కొన్ని తెలుగు చిత్రాల్లో మాత్రం టైటిల్స్ పడేటప్పుడు అంటే సినిమా అయిపోయిన తర్వాత పాటలు వచ్చాయి.ఇది వినడానికి వింతగా అనిపించినా నిజంగానే ఇలా సాంగ్స్ పెట్టి ఆశ్చర్యపరిచారు
రొమాంటిక్ ఫాంటసీ మూవీ మగధీర (2009)లో( Magadheera Movie ) లాస్ట్ లో ఒక పాట వస్తుంది.“అనగనగనగనగనగా రాజుకు పుట్టిన కొడుకులు తెచ్చిన చేపల బుట్టలోన ఒకటే యందుకు యండలేదురా” అంటూ ఒక పాట వస్తుంది ఇది మూవీ అయిపోయిన తర్వాత టైటిల్స్ పడే సమయంలో వస్తుంది.అయితే ఈ పాట కోసం కోట్లు ఖర్చు పెట్టారట అయినా ఇది మూవీ లాస్ట్ లో రావడం విశేషం.
ఈ పాటలో ఆ మూవీ కోసం పనిచేసిన వారందరూ కూడా కనిపిస్తారు.అందుకే చూసేందుకు ఇది బాగుంటుంది.
అయితే అఫీషియల్ ట్రాక్స్ లో కూడా ఈ సాంగ్ పేరు ఉండదు.కానీ ఈ పాట కూడా హిట్ అయింది.రాజమౌళి( Rajamouli ) దర్శకత్వంలో, అల్లు అరవింద్ నిర్మించిన ఈ సినిమాలో చిత్రంలో రామ్ చరణ్,( Ram Charan ) శ్రీహరి, కాజల్ అగర్వాల్, దేవ్ గిల్ నటించారు.సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీ రోబో 2.0( Robo 2.0 ) సినిమాకు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించాడు.యంత్ర లోకపు సుందరివే పాట( Yanthara Lokapu Sundarive ) ఈ సినిమాలో క్లైమాక్స్ అయిపోయాక వస్తుంది.దీనికి అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించాడు.
సిద్దు శ్రీరామ్, షాష తిరుపతి ఆలపించిన ఈ పాట కూడా చాలా బాగుంటుంది.సైన్స్ ఫిక్షన్ పాటగా ఇది సూపర్ సూపర్ హిట్ అయింది.ఈ పాట కోసం ఏకంగా 20 కోట్లు ఖర్చు పెట్టారట.అయితే థియేటర్లో ఇది ప్రేక్షకులు బయటకు వచ్చేటప్పుడు ప్లే అవుతుంది కాబట్టి ఈ పాటను చూసి ఎంజాయ్ చేసిన వారు తక్కువే అయ్యుండొచ్చు కానీ ఇది చూడదగిన పాటే.
సినిమా టైటిల్స్ పడేటప్పుడు పాట వేయాలని ఆలోచన దర్శకుడు రాజమౌళి తర్వాత శంకర్ ఒకరికే వచ్చింది ఇక మిగతా వారెవరు కూడా కోట్లు ఖర్చుపెట్టి ఎండ్ టైటిల్స్ రోలింగ్ లో పాటలు పెట్టలేదు.