తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్( Congress ) పై పోరాటం చేసే విషయంలో బీఆర్ఎస్ అధినేత కెసిఆర్( KCR ) వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.విద్యుత్ కొనుగోలు విషయంలో తనను విచారణకు హాజరవాల్సిందిగా అందిన నోటీసులపైనే ఘాటుగా లేఖ ద్వారా స్పందించారు తప్ప, కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం చేసే విషయంలో మాత్రం అంతగా ఆసక్తి చూపించడంలేదు.
పార్టీ కేడర్ కు చేస్తున్న సూచనలు చూస్తుంటే ఇప్పటికిప్పుడు పార్టీ తరఫున కాంగ్రెస్ పై పోరాటాలు, విమర్శలు చేసినా, కలిగే ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుందనే అభిప్రాయానికి వచ్చినట్టుగా కనిపిస్తున్నారు.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీ ల అమలకు కాంగ్రెస్ వంద రోజులు గడువు విధించుకుంది.
ఆ గడువు ముగియడంతో ఆ హామీలపై నిలదీసే విధంగా పోరాటాలు చేస్తామని గతంలో కేసీఆర్ ప్రకటించినా, ఇప్పుడు మాత్రం సైలెంట్ గానే ఉంటున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం విధానాలపై విమర్శలు చేసేందుకు అంతగా ఆసక్తి చూపించడం లేదు.దీంతో కేసీఆర్ ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారు అనేది అందరికీ ప్రశ్నగానే మారింది.అయితే కాంగ్రెస్ ప్రభుత్వం పై విమర్శలు చేసే విషయంలో పార్టీ నేతలు ఎవరూ తొందరపడొద్దు అని, ఇప్పటికిప్పుడు విమర్శలు చేయడం వల్ల కలిగే ప్రయోజనం ఏమి ఉండదని, ప్రజల మూడ్ ను బట్టి ప్రభుత్వంపై పోరాటం చేసేందుకు సిద్ధం కావాలని కేసిఆర్ భావిస్తున్నారు.
తొందరపాటు నిర్ణయాలతో పోరాటాలు మొదలుపెట్టినా, ప్రజల్లో ఆదరణ ఉండదని సూచిస్తున్నారట.
తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు( Parliament Elections in Telangana ) కూడా పూర్తవడంతో, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పై పోరాటా లు చేపట్టినా, పెద్దగా కలిసి వచ్చేది ఉండదని, అనవసరంగా పార్టీ క్యాడర్ క్షేత్రస్థాయిలో ఇబ్బందులు, కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుందని పార్టీ నేతలకు సూచిస్తున్నారట.అయితే ప్రస్తుతం విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలతో పాటు , కాళేశ్వరం ప్రాజెక్ట్, ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ నేతలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందనే ముందుచూపుతోనే కేసీఆర్ తన వైఖరిని మార్చుకోవడానికి కారణమట.