ఇంతకీ జగన్ అసెంబ్లీ లో అడుగుపెడతారా ? 

మరి కొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ అధినేత జగన్( YS Jagan ) హాజరవుతారా లేదా అనేది ఇప్పుడు అందరికీ ఆసక్తికరంగా మారింది.  ఈనెల 19వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు( AP Assembly Meeting ) ప్రారంభం అవుతాయి .

 Will Ys Jagan Enters Ap Assembly Meetings As Leader Of Opposition Details, Tdp,-TeluguStop.com

మొదటి రోజు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం జరుగుతుంది.  ఆ తరువాత స్పీకర్ ఎన్నిక నిర్వహిస్తారు.

ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలతో ప్రోటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు.మొత్తంగా 175 అసెంబ్లీ స్థానాలు ఉన్నా.

ఏపీ అసెంబ్లీలో టిడిపి నుంచి 135 మంది,  జనసేన నుంచి 21 ,వైసీపీ నుంచి 11 , బీజేపీ నుంచి 9 మంది ఎమ్మెల్యేలు గెలిచారు.

Telugu Ap Assembly, Ap Cm Jagan, Ap, Cm Chandrababu, Jagan, Janasena, Pawan Kaly

175 స్థానాలకు కేవలం 11 స్థానాలనే వైసిపి( YCP ) గెలుచుకోవడంతో,  ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయింది.  దీంతో ఏపీ అసెంబ్లీలో వైసిపి ఎమ్మెల్యేల వ్యవహార శైలి ఎలా ఉండబోతుందనేది అందరికీ ఆసక్తికరంగా మారింది.అసలు అసెంబ్లీ సమావేశాలకు జగన్ హాజరవుతారా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది.

ఈనెల 19వ తేదీన ప్రారంభమయ్యే శాసనసభ సమావేశాల్లో అందరు ఎమ్మెల్యేలతో పాటు,  జగన్ ప్రమాణస్వీకారం చేస్తారా లేక శాసనసభ సమావేశాలు ముగిసిన తరువాత స్పీకర్ ఛాంబర్ లో ఆయన బాధ్యతలు తీసుకుంటారా అనేది తేలాల్సి ఉంది.ఈ విషయంలో వైసిపి నాయకులకు సైతం జగన్ నిర్ణయం ఏంటి అనేది క్లారిటీ లేదు.

Telugu Ap Assembly, Ap Cm Jagan, Ap, Cm Chandrababu, Jagan, Janasena, Pawan Kaly

అసెంబ్లీ సమావేశాలకు జగన్ హాజరై ప్రభుత్వానికి సహకరిస్తారా లేక తొలి రోజు నుంచి అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించి ప్రభుత్వం పై విమర్శలు కొనసాగిస్తారా అనేది మరో రెండు రోజుల్లో తేలనుంది.ఈనెల 19 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ ఎమ్మెల్యేలంతా( YCP MLAs ) హాజరవుతారు.అయితే జగన్ విషయంలోనే క్లారిటీ రావాల్సి ఉంది.గత వైసీపీ ప్రభుత్వంలో టిడిపి అధినేత చంద్రబాబు ను( Chandrababu ) అసెంబ్లీ లో అనేక రకాలుగా వ్యక్తిగత దూషణలకు అప్పటి వైసీపీ మంత్రులు పాల్పడడం, చంద్రబాబు కుటుంబ సభ్యులను అవమానించడం తదితర పరిణామాలతో మళ్ళీ తాను ముఖ్యమంత్రిగాని అసెంబ్లీలో అడుగుపెడతానని అప్పట్లో చంద్రబాబు చేశారు.

దానికి తగ్గట్లు గానే సీఎంగా అసెంబ్లీ లో అడుగు పెడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube