వచ్చే 20 సంవత్సరాలు పవన్ కు తిరుగులేదా.. ఆ జ్యోతిష్కుని కామెంట్లు నిజమవుతాయా?

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Power Star Pawan Kalyan )ఈ ఎన్నికల్లో అద్భుతమైన ఫలితాలను సొంతం చేసుకోవడం ద్వారా వార్తల్లో నిలిచారు.పవన్ జాతకాన్ని పరిశీలించిన జ్యోతిష్కులు వచ్చే 20 సంవత్సరాలు పవన్ కు తిరుగులేదని కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

 Famous Astrologer Comments About Pawan Kalyan Details Here Goes Viral In Social-TeluguStop.com

ప్రముఖ జ్యోతిష్యుడు ఎంవీ సూర్యనారాయణ ( Astrologer MV Suryanarayana )ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.

పవన్ జాతకం ప్రకారం శని మహార్దశ నడుస్తోందని వృషభరాశిలో ఉచ్ఛ స్థితిలో శని ఉన్నాడని ఆయన చెప్పుకొచ్చారు.

మరో 19, 20 సంవత్సరాలు శని ప్రభావం వల్ల పవన్ కు తిరుగుండదని ఆయన కామెంట్లు చేశారు.కొన్ని ఇబ్బందులు, ఆటుపోట్లు ఎదురైనా వాటిని తట్టుకుని పవన్ కళ్యాణ్ నిలబడగలరని ఆ జ్యోతిష్కుడు పేర్కొన్నారు.

పవన్ ది వృశ్చిక లగ్నమని ఆయన చెప్పుకొచ్చారు.

ప్రజల మధ్య ఉంటూనే పవన్ కళ్యాణ్ ఎదుగుతున్నారని జ్యోతిష్కుడు అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం.ఎంవీ సూర్యనారాయణ చెప్పిన జాతకం భవిష్యత్తులో సైతం నిజం అవుతుందో లేదో తెలియాల్సి ఉంది.పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు ( Harihara Veeramallu )సినిమాకు జులై 1 నుంచి డేట్లు ఇచ్చారని సినీ వర్గాల్లో వినిపిస్తోంది.

పవన్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ అయితే ఫ్యాన్స్ సంతోషానికి అవధులు ఉండవు.

పవన్ కళ్యాణ్ కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా లేదా అనే చర్చ జరుగుతుండగా ఆ ప్రశ్నలకు సైతం సమాధానం దొరకాల్సి ఉంది.పవన్ కళ్యాణ్ భవిష్యత్తు సినిమాలు ఏ రేంజ్ లో బాక్సాఫీస్ ను షేక్ చేస్తాయో చూడాల్సి ఉంది.పవన్ రెమ్యునరేషన్ సైతం భారీ స్థాయిలో ఉండటం గమనార్హం.

పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో సంచలనాలు సృష్టించిన స్థాయిలో సినిమాల్లో సైతం సంచలనాలు సృష్టించాలని అభిమానులు ఫీలవుతుండటం గమనార్హం.పవన్ కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాలి.

https://twitter.com/i/status/1800402811857076292
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube