వీడియో వైరల్: హైవేపై కారు ఆపి కత్తులతో దాడి.. దోచుకోవడానికి దుండగుల యత్నం..

ఈ మధ్యకాలంలో పలు ప్రాంతాలలో హైవేల పై ప్రయాణం చేస్తున్న సమయంలో అనేక దోపిడికి గురైన సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.కొందరు గుంపులు గుంపులుగా ఉన్న వ్యక్తులు ఒక్కసారిగా రోడ్డుపై వెళ్తున్న వారి కారును అడిగించడం లేదా వారి వాహనాలను ఆపి వారిపై దాడికి పాల్పడి దోపిడీలను చేస్తున్నారు.

 The Video Went Viral The Thugs Tried To Stop The Car On The Highway And Attack W-TeluguStop.com

తాజాగా ఇలాంటి సంఘటన మరొకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తోంది.

ఈ దుర్ఘటన తమిళనాడు( Tamil Nadu ) రాష్ట్రంలో జరిగింది.ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు చూస్తే.

తమిళనాడు రాష్ట్రములోని సేలం – కొచ్చి హైవేపై ( Salem – Kochi Highway )మదుక్కరై సమీపంలో ఓ కారును వెంబడించిన కొంత మంది దుండగులు కత్తులతో దాడికి ప్రయత్నించారు.ఆపై వారందరు కారులోని వారిని దోచుకోవడానికి ప్రయత్నం చేసారు.ఒక్కసారిగా అర్థంకాని సంఘటనతో ఒక్కసారిగా తేరుకొని ఆ కారులో ఉన్న వ్యక్తి సమయ స్పూర్తితో వారినుండి తప్పించుకోవడానికి కారును అలాగే వెనక్కి పోనిచ్చాడు.ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు కారు డాష్ క్యాంలో రికార్డ్ అయ్యాయి.

ఈ రికార్డ్ అయినా దృశ్యాలని సొసైల్ మీడియాలో పోస్ట్ చేయగా ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

ఇకపోతే, ఈ దాడికి యత్నించిన నలుగురి వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేయగా, మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు అధికారులు తెలిపారు.ఇంకా ఈ ఘటన సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube