కూతురి లవ్ స్టోరీ పై అర్జున్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. తనకు అన్నీ తెలుసంటూ?

యాక్షన్ కింగ్ అర్జున్( Arjun ) తన పెద్ద కుమార్తె ఐశ్వర్య( Aishwarya ) వివాహాన్ని ఇటీవల ఎంతో ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే.కోలీవుడ్ నటుడు తంబి రామయ్య కుమారుడు ఉమాపతితో( Umapathy ) ఐశ్వర్య వివాహం జూన్ 10వ తేదీ చెన్నైలోని అర్జున్ నిర్మించిన ఆంజనేయస్వామి ఆలయంలో ఎంతో ఘనంగా జరిగింది.

 Arjun Sarja Interesting Comments About Her Daughter Aishwarya Love Story Details-TeluguStop.com

వీరిద్దరిది ప్రేమ వివాహం అనే సంగతి మనకు తెలిసిందే.ఇలా ఈ వివాహపు వేడుకలలో కేవలం కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరై సందడి చేశారు.

ఇక వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇకపోతే ఇటీవల ఈయన చెన్నైలో సినీ రాజకీయ ప్రముఖుల సమక్షంలో తన కుమార్తె రిసెప్షన్ వేడుకను కూడా ఎంతో ఘనంగా నిర్వహించారు.

ఈ రిసెప్షన్ వేడుకకు రాజకీయ ప్రముఖులతో పాటు సినీ ప్రముఖులు కూడా హాజరై సందడి చేశారు.ఇకపోతే ఈ వివాహ కార్యక్రమం అనంతరం ఈయన తన కుమార్తె ప్రేమ వివాహం( Love Marriage ) గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

తంబి రామయ్య( Thambi Ramaiah ) కుటుంబం ఎంతో సాంప్రదాయమైన కుటుంబమని తెలిపారు.

Telugu Aishwarya, Arjun Aishwarya, Arjun Sarja, Love Story, Thambi Ramaiah, Umap

ఒకసారి ఉమాపతి నేను హోస్ట్ చేస్తున్న కార్యక్రమానికి వచ్చారు.ఆ కార్యక్రమంలో ఆయనను చూసి చాలా ఇంప్రెస్స్ అయిపోయానని తెలిపారు.ఆ సమయంలోనే తన కూతురితో ఉమాపతికి పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త ప్రేమగా మారిందని తెలిపారు.

ఇక ఒకసారి నా కూతురు నాతో పర్సనల్ గా మాట్లాడాలని చెప్పింది అప్పుడే నేను తన ప్రేమ గురించి మాట్లాడుతుందని ఊహించాను.ఇక తాను మాట్లాడేటప్పుడు తంబి రామయ్య ఉమాపతి గురించి మాట్లాడటంతో ఇక ఇది ప్రేమ వ్యవహారమేనని నేను ఫిక్స్ అయిపోయాను.

Telugu Aishwarya, Arjun Aishwarya, Arjun Sarja, Love Story, Thambi Ramaiah, Umap

ఇలా తన కుమార్తె ప్రేమ గురించి చెప్పడంతో నేను నిర్మించిన హనుమాన్ ఆలయంలోనే మేము వారి ప్రేమ పెళ్లి గురించి మాట్లాడి ఫిక్స్ చేశామని అర్జున్ తన కుమార్తె ఐశ్వర్య ఉమాపతిల ప్రేమ వ్యవహారం గురించి కామెంట్స్ చేశారు.ఇక ప్రస్తుతం ఐశ్వర్య హీరోయిన్ గా కన్నడ తమిళ చిత్రాలలో నటించారు.ఇక పెళ్లి తర్వాత కూడా ఆమె సినిమాలలో నటిస్తారా అనే ప్రశ్న ఈయనకు ఎదురయింది.ఈ ప్రశ్నకు అర్జున్ సమాధానం చెబుతూ జీవిత బాగ స్వామిని ఎంచుకున్న ఆమెకు సినిమాలలో నటించాలా వద్దా అన్నది కూడా తెలుసని అర్జున్ సమాధానం చెప్పారు.

ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube