ఈ వారం థియేటర్లు, ఓటీటీలలో రిలీజ్ కానున్న క్రేజీ సినిమాల లిస్ట్ ఇదే!

గత వారం థియేటర్లలో విడుదలైన మహారాజ, హరోంహర సినిమాలు ప్రేక్షకులను మెప్పించడంతో పాటు మంచి కలెక్షన్లను సొంతం చేసుకున్నాయి.ఈ సినిమాలు నిర్మాతలకు సైతం మంచి లాభాలను అందించాయని సమాచారం అందుతోంది.

 This Week Theatrical And Ott Release Crazy Movies Nindha Omg Honeymoon Express D-TeluguStop.com

ఈ నెల 27వ తేదీన కల్కి సినిమా రిలీజ్ కానుండటం ఈ వారం మరీ ఎక్కువ సంఖ్యలో సినిమాలు విడుదల కావడం లేదు.వరుణ్ సందేశ్ నటించిన నింద( Nindha Movie ) ఈ నెల 21వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది.

వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రలో ఓ.ఎమ్.జీ( OMG Movie ) పేరుతో ఒక సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమాపై కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి.ఈ సినిమా కూడా 21న రిలీజ్ కానుంది.

చైతన్యరావు, హెబ్బా పటేల్ జంటగా నటించిన హనీమూన్ ఎక్స్ ప్రెస్ మూవీ( Honeymoon Express ) సైతం ఈ నెల 21న రిలీజ్ కానుంది.ఈ వారం థియేటర్లలో ఈ మూడు క్రేజీ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.

Telugu Americas Sweet, Baak, Bad Cop, Crazy, Kota Factory, Ott, Nindha, Omg, The

ఓటీటీల విషయానికి వస్తే నెట్ ఫ్లిక్స్ లో ఈ నెల 20 నుంచి కోటా ఫ్యాక్టరీ 3( Kota Factory 3 ) స్ట్రీమింగ్ కానుంది.థియేటర్లలో మంచి టాక్ సొంతం చేసుకున్న బాక్ మూవీ( Baak Movie ) ఈ నెల 21 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో సౌత్ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.నెట్ ఫ్లిక్స్ లో ఈ నెల 18 నుంచి ఏజెంట్ ఆఫ్ మిస్టరీ కొరియన్ సిరీస్ స్ట్రీమింగ్ కానుండగా అదే తేదీన అవుట్ స్టాండింగ్ అనే హాలీవుడ్ సిరీస్ సైతం స్ట్రీమింగ్ కానుంది.

Telugu Americas Sweet, Baak, Bad Cop, Crazy, Kota Factory, Ott, Nindha, Omg, The

మహరాజ్ హిందీ సిరీస్ ఈ నెల 19 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుండటం గమనార్హం.అమెరికాస్ స్వీట్ హార్ట్స్( Americas Sweet Hearts ) వెబ్ సిరీస్ ఈ నెల 20న స్ట్రీమింగ్ కానుండగా జూన్ 21న నడిగర్ మలయాళం వెర్షన్, ట్రిగ్గర్ వార్నింగ్ హాలీవుడ్ సిరీస్ స్ట్రీమింగ్ కానున్నాయి.డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ నెల 21న బ్యాడ్ కాప్( Bad Cop ) హిందీ వెర్షన్ స్ట్రీమింగ్ కానుంది.

జియో సినిమాలో ది హోల్డోవర్స్ ఇంగ్లీష్ వెర్షన్ నిన్నటి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.

Telugu Americas Sweet, Baak, Bad Cop, Crazy, Kota Factory, Ott, Nindha, Omg, The

ఈ నెల 17 నుంచి హౌస్ ఆఫ్ ది డ్రాగన్2 వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది.జూన్ 19వ తేదీ నుంచి ఇండస్ట్రీ వెబ్ సిరీస్ జియో సినిమాలో స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది.బిగ్ బాస్3 ఓటీటీ ఈ నెల 21వ తేదీన నుంచి స్ట్రీమింగ్ కానున్నట్టు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube