కొన్నిసార్లు సినిమా అవకాశాలు ఎలా వస్తోయో ఎవరికి తెలియదు.సేమ్ ఇలాగే ఓ కుర్రాడికి సినిమా చాన్స్ దక్కింది.
సినిమా చూడ్డానికి వెళ్లిన దర్శకుడికి కలిసిన యువకుడు.ఆ తర్వాత అదే కుర్రాడితో సినిమా తీసి హిట్ కొట్టాడు.
ఇంతకీ ఎవరా కుర్రాడు? సక్సెస్ అయిన దర్శకుడెవరు? ఇప్పుడు తెలుసుకుందాం!
2001లో ఉదయ్ కిరణ్ మూవీ నువ్వు-నేను రిలీజ్ అయ్యింది.హైదరాబాద్ క్రాస్ రోడ్స్ లోని సుదర్శన్ ధియేటర్లో సినిమా చూసేందుకు వెళ్లాడు ఆ సినిమా దర్శకుడు తేజ.
మూవీ చూస్తున్న సమయంలో తనకు ఓ కుర్రాడు కనిపించాడు.చాలా యాక్టివ్‌గా, ఇంట్రెస్టింగ్ గా అనిపించాడు.
ఇంటర్వెల్ లో ఆ కుర్రాడి దగ్గరికి వెళ్లి పరిచయం చేసుకున్నాడు తేజ.సినిమాల్లోకి వస్తావా అని అడిగాడు.
వెంటనే అందుకు తను ఓకేచెప్పాడు.కాంటాక్ట్ చేయడానికి ఫోన్ నెంబర్ ఇచ్చాడు.
ఆ అబ్బాయే నితిన్.

నువ్వు-నేను విజయం తర్వాత తేజకు మంచి అవకాశాలు వచ్చాయి.అల్లు అరవింద్ తన కొడుకు అల్లు అర్జున్ తో సినిమా తీయాలని కోరాడు.తేజ స్టోరీ కూడా రెడీ చేశాడు.
కానీ అల్లు అర్జున్ ఆ పాత్రకు సూటవడని.నో చెప్పాడు తేజ.
మళ్లీ సారి తనతో సినిమా చేస్తానని చెప్పాడు.అదే సమయంలో నువ్వు నేను 150 రోజుల వేడుక జరిగింది.
అదే రోజు తేజకు నితిన్ కాల్ చేశాడు.వెంటనే తనను ఆఫీసుకు రమ్మన్నాడు.
పోటో షూట్, టెస్ట్ షూట్ చేశాక… నితిన్ ను తన సినిమాకు ఓకే చేశాడు.ఆ సినిమా పేరు జయం.
ఈ సినిమాలో హీరోయిన్ గా సదాను ఎంపిక చేశాడు.ముందుగా పాటలు రికార్డు చేశారు.

తొలుత విలన్ ని కూడా ముంబై నటుడినే ఎంపిక చేశాడు తేజ.సినిమా షూటింగ్ మొదలయ్యాక.అతడిపై కొన్ని సీన్స్ తీశాడు.కానీ తేజకు నచ్చలేదు.వెంటనే గోపీచంద్‌కు కాల్ చేశాడు.మంచి స్వింగ్ లో ఉన్న దర్శకుడి నుంచి కాల్ రావడంతో గోపిచంద్ తేజను కలిశాడు.
లుక్ టెస్ట్ తర్వాత.విలన్ గా చేయాలన్నాడు.
కొద్దిసేపు ఆలోచించి ఓకే చెప్పాడు గోపీచంద్.తన కుటుంబ సభ్యులు వద్దు అని చెప్పినా.
తేజ మీద నమ్మకంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.సినిమా విడుదల అయ్యాక మంచి హిట్ అయ్యింది.