ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని మధుర సంఘటనలు, సందర్భాలుంటాయి.వాటిని జీవితాంతం పదిపరుచుకుంటారు చాలా మంది.
ఆ గొప్ప ఘటనల గురించి ఎన్నోసార్లు గుర్తుకు తెచ్చుకుంటారు.అలాంటి సంఘటనే నందమూరి నట సింహం బాలయ్య జీవితంలోనూ ఉంది.
ఇంతకీ ఆ గొప్ప సందర్భం ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఎవరి ఫ్యామిలీలోనైనా తొలిసారి చిన్నారి పుడితే ఆ సంతోషం మాటల్లో వర్ణించలేని విధంగా ఉంటుంది.
ఆ ఆనందం వ్యక్త పరచడం చాలా కష్టం.అలాగే బాలయ్య, వసుంధర జీవితంలో తొలి సంతానంగా పుట్టింది బ్రహ్మిణి.19887 డిసెంబర్ 21న ఈ చిన్నారి జన్మించింది.ఆ సమయంలో తన తాత విశ్వనటుడు నందమూరి రామారావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు.
అదే సందర్భంలో డోలారోహణ కార్యక్రమం జరిగింది.ఈ వేడుక కన్నుల పండువగా జరిపించాడు బాలయ్య.
ఈ ఫంక్షన్ కు వచ్చిన ఎన్టీఆర్.మనువరాలిని ఆశీర్వదించి.
మురిసిపోయారు.దిగ్గజ నటులు జగ్గయ్య, శివాజీ గణేషన్, షావుకారు జానకి, దర్శకుడు ఎల్వీ ప్రసాద్, నిర్మాత బి.నాగిరెడ్డి, రచయిత సరసరాజు సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొని చిన్నారి బ్రహ్మణికి ఆశీర్వాదాలు అందించారు.

ఈ వేడుకకు హాజరైన పెద్దలను ఎన్టీఆర్ పెద్ద కుమారుడు జయకృష్ణ, బాలకృష్ణ ఎదురెళ్లి ఘన స్వాగతం పలికారు.వచ్చిన వారందరినీ నవ్వుతూ పలకరించారు.వారితో ఉన్న పాత జ్ఞాపకాలను, పరిచయాలను గుర్తు చేసుకున్నారు.
సరదాగా కబుర్లు చెప్పుకున్నారు.అద్భుతంగా అలంకరించిన మల్లె పందిళ్ల కింద విందు చేస్తూ కనువిందు చేశారు.
అప్పట్లో ఈ వేడుక అన్ని ప్రముఖ పత్రికల్లో ప్రధాన వార్తలుగా ప్రచురితం అయ్యాయి.బాలయ్య చేసిన ఈ వేడుక గురించి రాష్ట్ర ప్రజలంతా మాట్లాడుకున్నారు.
బాలయ్య నిజంగా అద్రుష్ట వంతుడని అందరూ పొగడ్తల్లో ముంచెత్తారు.అలనాటి బ్రహ్మణి ఉయ్యాల వేడుక ఫోటోలు తాజాగా సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.
అందరూ అలనాటి ఈ చిన్నారి గురించి చర్చలు జరపుతున్నారు.