బన్నీకి బ్యాడ్ టైమ్ నడుస్తోందా.. బన్నీ బంగారం ముట్టుకున్నా మసే అవుతోందిగా!

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు( Allu Arjun ) ప్రస్తుతం బ్యాడ్ టైమ్ నడుస్తోందా అనే ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది.స్నేహం కోసం నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి( Silpa Ravichandra Kishore Reddy ) తరపున బన్నీ ప్రచారం చేశారు.

 Bad Time Is Running For Allu Arjun Details, , Allu Arjun, Allu Arjun Bad Time, P-TeluguStop.com

అయితే ఆ అభ్యర్థి ఎన్నికల్లో ఓడిపోవడంతో పాటు వైసీపీకి సైతం భారీ షాకిచ్చేలా ఫలితాలు వెలువడ్డాయి.మెగా హీరో సాయితేజ్( Saitej ) బన్నీని సోషల్ మీడియాలో అన్ ఫాలో చేశారు.

మరోవైపు అల్లు అర్జున్ ప్రస్తుతం నటిస్తున్న పుష్ప2 సినిమా( Pushpa 2 ) వాయిదా పడక తప్పదని తెలుస్తోంది.క్వాలిటీ విషయంలో రాజీ పడటానికి ఇష్టపడని దర్శకుడు సుకుమార్ ఈ సినిమాను వాయిదా వేయక తప్పదని వెల్లడించారని సమాచారం అందుతోంది.

బన్నీ గత సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచిన సంగతి తెలిసిందే.బ్యాక్ టు బ్యాక్ ఇండస్ట్రీ హిట్లను సొంతం చేసుకోవడం ఈ హీరోకే సాధ్యమైంది.

మరోవైపు పుష్ప2 వాయిదా పడటం వల్ల బన్నీ కెరీర్ లో భారీ గ్యాప్ వచ్చినట్టు అవుతుందనే కామెంట్లు సైతం వ్యక్తమవుతున్నాయి.బన్నీ బంగారం ముట్టుకున్నా మసే అవుతోందిగా అంటూ నెటిజన్లు కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.పుష్ప ది రూల్ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన సాంగ్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.ఈ పాటలకు రికార్డ్ స్థాయిలో వ్యూస్ వచ్చాయి.

బన్నీ తర్వాత సినిమా త్రివిక్రమ్ డైరెక్షన్ లో ( Trivikram ) తెరకెక్కనుంది.పుష్ప2 సినిమాకే ఇంత సమయం పడితే పుష్ప 3 సినిమాకు( Pushpa 3 ) ఎన్నేళ్లు పడుతుందనే చర్చ జరుగుతోంది.పుష్ప2 హిట్టైతే ఈ పరిస్థితి కొంతమేర మారుతుందని చెప్పవచ్చు.రాబోయే రోజుల్లో బన్నీ జాతకం మారుతుందేమో చూడాల్సి ఉంది.

బన్నీ కెరీర్ వేగంగా పుంజుకోవాలని సమస్యలు పోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube