ఆ ఎదురుదెబ్బల వల్లే వరుణ్ తేజ్ మారారా.. అన్ని కథలను వరుణ్ రిజెక్ట్ చేశారా?

మెగా హీరో వరుణ్ తేజ్( Varun Tej ) నటించిన సినిమాలలో హిట్టైన సినిమాల కంటే ఫ్లాపైన సినిమాలే ఎక్కువగా ఉన్నాయి.అయితే ప్రయోగాలు చేయడంలో వరుణ్ తేజ్ కు ఎవరూ సాటిరారని చాలామంది భావిస్తారు.

 Continuous Flops Effect On Varun Tej Career Details, Varun Tej, Varun Tej Flop M-TeluguStop.com

అయితే వరుణ్ తేజ్ ఈ మధ్య కాలంలో నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు ఫ్లాప్( Flop Movies ) కావడంతో పాటు నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చాయి.అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలు మాత్రమే వరుణ్ తేజ్ కు ప్లస్ అయ్యాయి.

మంచి కథలను ఎంచుకుని ఇకపై విజయాలను సైతం అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.వరుణ్ తేజ్ ఈ మధ్య కాలంలో 12 కథలను రిజెక్ట్ చేశారని ఆ ప్రాజెక్ట్ లలో మెజారిటీ ప్రాజెక్ట్ లు ప్రముఖ బ్యానర్ల నుంచి ఆఫర్లు వచ్చిన ప్రాజెక్ట్ లు అని సమాచారం అందుతోంది.

గని,( Ghani ) గాండీవధారి అర్జున,( Gaandeevadhari Arjuna ) ఆపరేషన్ వాలంటైన్( Operation Valentine ) సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాయి.

Telugu Ghani, Varun Tej, Matka, Valentine, Tollywood, Varun Tej Flop-Movie

ప్రయోగాత్మక కథల కంటే కమర్షియల్ కథలకే వరుణ్ తేజ్ ఓటు వేస్తే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.వరుణ్ తేజ్ భవిష్యత్తు ప్లానింగ్ ఏ విధంగా ఉండబోతుందో చూడాల్సి ఉంది.నిర్మాతలకు మంచి లాభాలను అందించాలని వరుణ్ తేజ్ భావిస్తున్నారని సమాచారం అందుతోంది.

మరోవైపు ఎఫ్4 మూవీ( F4 Movie ) త్వరలో సెట్స్ పైకి వెళ్లనుందని తెలుస్తోంది.

Telugu Ghani, Varun Tej, Matka, Valentine, Tollywood, Varun Tej Flop-Movie

వరుణ్ తేజ్ ఇతర భాషల్లో సైతం సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.వరుణ్ తేజ్ ప్రస్తుతం మట్కా సినిమాలో( Matka Movie ) నటిస్తుండగా ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.కరుణ కుమార్ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది.

ఈ సినిమా వరుణ్ తేజ్ ఆశలను నెరవేరుస్తుందేమో చూడాలి.వరుణ్ తేజ్ కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే భారీ విజయాలు సొంతమయ్యే అవకాశాలు ఉంటాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube