వినీత్ కే( Vineeth K ) అనే వ్యక్తి న్యూజెర్సీలోని నెవార్క్‌కు ఆఫీసు పనిమీద వెళ్ళేందుకు ఎయిర్ ఇండియా బిజినెస్ క్లాస్‌లో ప్రయాణించారు.కానీ, ఎయిర్ ఇండియాలో జర్నీ ఆయన ఊహించింది దాని కన్నా పూర్తిగా భిన్నంగా, పీడకలలా అనిపించిందట.
ఎందుకంటే వినీత్ ఫ్లైట్ “AI 105” 25 నిమిషాలు ఆలస్యంగా బయలుదేరింది.బిజినెస్ క్లాస్‌కు ఎక్కిన తర్వాత, సీట్లు చాలా దుమ్ముపట్టి, పాతవిగా ఉండటం చూసి ఆయన నిరాశపడ్డారు.
35 సీట్లలో కనీసం 5 సీట్లు పనికిరాకుండా ఉన్నాయి.రాత్రి 3:30 గంటలకు విమానం బయలుదేరిన తర్వాత, వినీత్ నిద్రపోవాలనుకున్నారు కానీ, ఆయన సీటు ప్లాట్‌ఫామ్ లాగా మడత పడేది కాదు.అది ఫ్లాట్ బెడ్‌గా మారలేదు ఎందుకంటే అది పాడైపోయి ఉంది.తినే విషయంలో కూడా ఇబ్బంది ఎదురైంది.
ఉడికించని భోజనం, పాతబడిన పళ్లాలలో వడ్డించారు.చాలా మంది ప్రయాణీకులు తిన్నది తిరిగి ఇచ్చేశారు.
ఇంకా దారుణమేమిటంటే, వినీత్ ఎంటర్‌టైన్‌మెంట్ సిస్టమ్‌ని ( Vineet Entertainment System )ఉపయోగించాలని ప్రయత్నించినప్పుడు “నాట్ ఫౌండ్”( Not Found ) అనే ఒక మెసేజ్ వచ్చింది.సాధారణంగా బిజినెస్ క్లాస్ ప్రయాణం విలాసవంతంగా ఉంటుంది కానీ, వినీత్ కె చెప్పినట్లుగా ఈ ప్రయాణం ఆహ్లాదకరంగా లేకుండా పోయింది.ఇంకో షాక్ ఏమిటంటే, వినీత్ గమ్యస్థానానికి చేరుకున్నప్పుడు తన లగేజీ దెబ్బతిన్నట్లు గమనించాడు.
వినీత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన విషయం గురించి ఎయిర్ ఇండియా స్పందించింది.అసౌకర్యానికి క్షమాపణలు తెలిపింది.అతని ఆందోళనలను అంతర్గతంగా సమీక్షిస్తామని హామీ ఇచ్చింది.
వినీత్ చెప్పిన విషయాలు విమానయాన సంస్థ సేవలో భారీ లోపాలను వెలుగులోకి తీసుకొచ్చాయి.సీట్ల పరిశుభ్రత, పనితీరు నుంచి ఆహారం, వినోదం నాణ్యత వరకు అనేక సమస్యలు ఉన్నాయి.
ప్రయాణికుల అంచనాలను తీర్చడానికి, సౌకర్యవంతమైన విమానాన్ని నిర్ధారించడానికి బిజినెస్ క్లాస్‌లో అధిక ప్రమాణాలను కొనసాగించాల్సిన అవసరం ఉంది.