అమెరికా…( America ) శాస్త్ర, సాంకేతిక, ఆర్ధిక రంగాల్లో అగ్రగామిగా వెలుగొందుతున్న దేశం.అందుకే ప్రపంచంలోని అన్ని దేశాల ప్రజల ఫైనల్ డెస్టినేషన్ అమెరికాయే.
విద్య, ఉపాధి, వ్యాపార అవకాశాల కోసం ప్రతి ఏటా అగ్రరాజ్యానికి వెళ్లే వారి సంఖ్య పెరుగుతోంది.ఏదో ఒక రకంగా అమెరికాలో స్థిరపడి నాలుగు రాళ్లు వెనకేసుకోవాలని ప్రపంచం భావిస్తోంది.
ఇందులో భారతీయులు( Indians ) సైతం వున్నారు.అక్కడి వలసదారుల్లో అత్యంత శక్తివంతమైన, బలమైన కమ్యూనిటీ ఇండియన్సే.
అందుకే అప్పు చేసైనా సరే తమ పిల్లలను అమెరికా పంపిస్తున్నారు తల్లిదండ్రులు.అక్కడ తమ పిల్లలు సంపాదిస్తుంటే ఇక్కడ గొప్పగా చెప్పుకోవడంతో పాటు ఆస్తుల్ని సంపాదించుకోవచ్చన్నది లక్షలాది మంది భారతీయ పేరెంట్స్ కల.
అయితే అమెరికాలో ఉన్నత విద్య, ఉపాధి కోసం వెళ్లిన భారతీయులు ఈ ఏడాది వరుసగా హత్యలకు గురికావడం కలకలం రేపుతోంది.ఈ పరిణామాలు పిల్లల తల్లిదండ్రులను భయాందోళనలకు గురిచేస్తోంది.
రెండ్రోజుల క్రితం న్యూజెర్సీ రాష్ట్రంలో పంజాబ్ రాష్ట్రానికి( Punjab ) చెందిన ఇద్దరు మహిళలపై అదే ప్రాంతానికి చెందిన యువకుడు కాల్పులు జరపగా, ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపుతోంది.

బాధితులను పంజాబ్‌లోని నూర్మహల్ సమీపంలోని గోర్సియన్ పీరన్ గ్రామానికి చెందిన జస్వీర్ కౌర్ (29),( Jasvir Kaur ) గగన్ (20)గా( Gagan ) గుర్తించారు.వివాహిత అయిన జస్వీర్ తుపాకీ కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు.నిందితుడిని పంజాబ్‌లోని హుస్సేన్‌పూర్ గ్రామానికి చెందిన గౌరవ్ గిల్ (21)గా( Gaurav Gill ) గుర్తించిన అమెరికా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు .గగన్, జస్వీర్ కౌర్‌లు జీవితంలో స్థిరపడాలనే ఉద్దేశంతో అమెరికాకు వెళ్లారు, కానీ తాజా ఘటనతో వారి కలలు చెదిరిపోయాయి.దేశం కానీ దేశంలో పంజాబీ యువకుల చేతుల్లోనే బాధితులుగా మారడం దోబా( Doaba ) ఏరియాలోని ఎన్ఆర్ఐ బెల్ట్‌కు ప్రమాద ఘంటికలను మోగిస్తోంది.

ఇలాంటి ఘటనలు జరుగుతున్న దేశాల జాబితాలో అమెరికా అగ్రస్థానంలో ఉండగా.అటువంటి నేరాలకు ఎక్కువగా బలి అవుతున్న ప్రాంతాల జాబితాలో దోబా టాప్ ప్లేస్‌లో ఉండటం గమనార్హం.ఈ ఏడాది దోబా ఏరియాకు చెందిన నలుగురు అమెరికాలో జరిగిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు.వారం రోజుల క్రితం జూన్ 8న న్యూయార్క్‌లోని రిచ్‌మండ్ హిల్ వద్ద కపుర్తలాలోని నారంగ్‌పూర్ గ్రామానికి చెందిన కరమ్‌జిత్ సింగ్ ముల్తానీ (33)( Karamjit Singh Multani ) కోపావేశాలతో తన తమ్ముడు విపన్ పాల్ ముల్తానీ, తల్లిపైనా కాల్పులకు తెగబడి ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో నవాన్‌షహర్‌లోని బంగాకు చెందిన హర్‌ప్రీత్ సింగ్( Harpreet Singh ) అనే 27 ఏళ్ల యవకుడు కాలిఫోర్నియాలో ఒక స్నేహితుడి చేతిలో కాల్పులకు గురయ్యాడు.వీరంతా కూడా పేద కుటుంబాలకు చెందిన వారే కావడం గమనార్హం.
పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించి తమ కష్టాలను తీరుస్తారని ఆశించిన తల్లిదండ్రులకు తీరని కడుపుకోత మిగులుతుంది.