రోజు ఉదయం ఈ ఆయుర్వేదిక్ డ్రింక్ ను తీసుకుంటే ఎంత లావుగా ఉన్నా సన్నబడతారు!

లావుగా ఉన్నామని చాలామంది లోలోన తీవ్రంగా మదన పడుతుంటారు.అధిక బరువు వల్ల శారీరకంగా ఎన్నో సమస్యలను ఎదుర్కొంటారు.

 Take This Ayurvedic Drink To Lose Weight Fast-TeluguStop.com

అలాగే మానసికంగా కూడా కొందరు కృంగిపోతుంటారు.అందుకే బరువు తగ్గడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తుంటారు.

మీరు ఈ లిస్టులో ఉంటే అస్సలు వర్రీ అవ్వకండి.ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే ఆయుర్వేదిక్ డ్రింక్( Ayurvedic drink ) ను తీసుకుంటే ఎంత లావుగా ఉన్నవారు అయినా సరే వేగంగా సన్నబడతారు.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ ఆయుర్వేదిక్ డ్రింక్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి.

ముందు రెండు ఉసిరికాయలు( Indian gooseberry ) తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి గింజ తొలగించి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ పోయాలి.వాటర్ కాస్త హీట్ అవ్వగానే అందులో కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలు వేసుకోవాలి.

అలాగే పావు టేబుల్ స్పూన్ అశ్వగంధ పొడి, పావు టేబుల్ స్పూన్ పసుపు, వన్ టేబుల్ స్పూన్ తరిగిన అల్లం ముక్కలు, పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసి ఎనిమిది నుంచి పది నిమిషాల పాటు మరిగించాలి.

ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి స్టైనర్ సహాయంతో వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.ఈ వాటర్ లో వన్ టేబుల్ స్పూన్ తేనె కలిపి సేవించాలి.ఈ ఆయుర్వేదిక్ డ్రింక్ ను ప్రతిరోజు ఉదయాన్నే తీసుకుంటే మెటబాలిజం రేటు అద్భుతంగా ఇంప్రూవ్ అవుతుంది.

దీంతో క్యాలరీలు త్వరగా బర్న్ అవుతాయి.ఫలితంగా వేగంగా వెయిట్ లాస్ అవుతారు.

అలాగే ఈ ఆయుర్వేదిక్ డ్రింక్ ను తీసుకోవడం వల్ల రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుంది.జలుబు, దగ్గు, గొంతు నొప్పి, గొంతు వాపు వంటి సమస్యలు ఉంటే దూరం అవుతాయి.

మరియు డిప్రెషన్, ఒత్తిడి వంటి మానసిక సమస్యలను నివారించి మెదడును మరియు మనసును ప్రశాంతంగా మార్చడానికి కూడా ఈ డ్రింక్ సహాయపడుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube