ప్రియురాలి కోసం ప్రియుడు( boyfriend ) ఎంతకైనా తెగిస్తాడని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు వారికి ఇబ్బంది కలగకుండా చూసుకునేందుకు ప్రియుడు ఎన్ని కష్టాలు పడడానికైనా సిద్ధమవుతాడు.ఆ విషయం మరోసారి నిజమైంది.
కాలిఫోర్నియాలోని జోషువా ట్రీ నేషనల్ పార్క్( Joshua Tree National Park in Californi ) దక్షిణాన ఉన్న ఎడారిలో లవర్స్ ట్రెక్కింగ్ చేయడానికి వెళ్లారు.అయితే వారి దగ్గర నీరు అయిపోయింది.
దాంతో బాగా అలసిపోయారు.గర్ల్ ఫ్రెండ్ ఎడారి ఎండకి బాగా బాధపడుతుంటే చూడలేక బాయ్‌ఫ్రెండ్ తన శరీరాన్ని ఆమె శరీరంపై ఉంచి రక్షణ అందించాడు.

ఈ ఘటన ఆదివారం జూన్ 9న చోటుచేసుకుంది.ఆ సమయంలో ఎడారి వాతావరణం ఉష్ణోగ్రతలు 100 డిగ్రీలకు పైగా నమోదు అయ్యాయి.జంట ట్రెక్కింగ్ చేస్తున్నప్పుడు నీరు అయిపోయి, అలసిపోయారు.మహిళ తీవ్రంగా డీహైడ్రేషన్‌తో బాధపడింది.ముందుకు కదిలే శక్తి లేదు అని గమనించిన వ్యక్తి 911కి కాల్ చేశాడు. రివర్‌సైడ్ కౌంటీ షెరిఫ్ ఆఫీస్ సెర్చ్ అండ్ రెస్క్యూ హెలికాప్టర్‌ను పంపింది.
హెలికాప్టర్ టీమ్ జంటను పెయింటెడ్ క్యాన్యన్ ప్రాంతంలో ఒక ఎండిపోయిన నది పాయలో కనుగొంది.వ్యక్తి తీవ్రమైన వేడి, గాలి నుంచి తన ప్రియురాలిని రక్షించడానికి తన శరీరాన్ని ఉపయోగించాడు.
దాంతో అధికారులు ఫిదా అయిపోయారు.

షెరీఫ్ ( Sheriff )ఆఫీస్ ఆన్‌లైన్‌లో ఈ ప్రేమ పక్షులకు సంబంధించిన ఓ వీడియోను పోస్ట్ చేసింది, దానిలో హెలికాప్టర్ ఆ జంట పైన ఎగురుతున్న దృశ్యాలు ఉన్నాయి.రక్షణ బృందం వరుసగా ఆ వ్యక్తి, మహిళను హెలికాప్టర్‌లోకి ఎక్కించింది.ఆ తర్వాత వారిని ల్యాండింగ్ జోన్‌కు తీసుకువెళ్లారు.
ఆ మహిళ పరిస్థితి తీవ్రంగా ఉండటం వల్ల, ఒక ప్రత్యేక వైద్య హెలికాప్టర్ వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించింది.ఆ వ్యక్తి కూడా వైద్య సహాయం అవసరమైనా, అంబులెన్స్ ద్వారా స్థానిక ఆసుపత్రికి తరలించారు అని షెరీఫ్ ఆఫీస్ తెలిపింది.
దక్షిణ కాలిఫోర్నియాలోని ఎడారులు, ముఖ్యంగా పెయింటెడ్ క్యాన్యన్ ప్రాంతం చుట్టుపక్కలు రాష్ట్రంలోని అత్యంత వేడి ప్రాంతాలలో ఉన్నాయి.ఈ ఘటన సమయంలో వాతావరణ శాఖ రికార్డుల ప్రకారం ఉష్ణోగ్రతలు 100 నుంచి 105 డిగ్రీల ఫారెన్‌హీట్ (37.8 నుంచి 40.6 డిగ్రీల సెల్సియస్) మధ్య ఉన్నాయి.ఈ విపరీత వాతావరణ పరిస్థితుల్లో ట్రెక్కింగ్ చేసేటప్పుడు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని షెరీఫ్ శాఖ హైకర్లకు గుర్తు చేసింది.అనుకున్న దానికంటే ఎక్కువ నీరు తీసుకెళ్లాలని, పటిష్టమైన ట్రెక్కింగ్ ప్లాన్‌ను కలిగి ఉండాలని, ట్రెక్కింగ్ రూట్, షెడ్యూల్ గురించి కనీసం ఇద్దరు వ్యక్తులకు తెలియజేయాలని అన్నారు.