క్లీంకారకు గోరుముద్దలు తినిపించడం నాకెంతో ఇష్టం.. చరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు వైరల్!

హీరో రామ్ చరణ్( Ram Charan ) గురించి మనందరికీ తెలిసిందే.చెర్రీ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు.

 Celebrities Share Heartfelt Wishes On Fathers Day, Fathers Day, Ram Charan, Klin-TeluguStop.com

ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొక వైభవ్ తన ఫ్యామిలీతో కావలసినంత సమయాన్ని గడుపుతూ చిల్ అవుతున్నారు చెర్రీ.ఇకపోతే రాంచరణ్ ఇటీవలే తండ్రిగా ప్రమోషన్ కూడా పొందిన విషయం తెలిసిందే.

రామ్ చరణ్ ఉపాసన దంపతులకు క్లీంకారకు ( Klin Kara )అనే పాప కూడా పుట్టింది.ఇక పాప పుట్టినప్పటినుంచి ఇప్పటివరకు పాప ఫేస్ ని రివిల్ చేయలేదు మెగా ఫ్యామిలీ.

Telugu Shareheartfelt, Fathers Day, Klinkara, Ram Charan, Tollywood-Movie

ఎక్కడికి వెళ్లినా కూడా తన కూతురు ముఖం కనిపించకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్త పడుతూ వస్తున్నారు ఉపాసన దంపతులు.ఇక కూతురు పుట్టిన తర్వాత ఎక్కువ సమయాన్ని కూతురు తోనే గడపడానికి ఇష్టపడుతున్నారు చెర్రీ.ఇది ఇలా ఉంటే తాజాగా రామ్ చరణ్ ఫాదర్స్ డే సందర్భంగా తన కూతురితో కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు.ఈ మేరకు అందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ ఈ విధంగా రాసుకొచ్చారు చెర్రీ.

క్లీంకారకు గోరు ముద్దలు తినిపించడం తనకెంతో ఇష్టమని, రోజులో రెండుసార్లైనా స్వయంగా తినిపిస్తానని, తాను తినిపిస్తే గిన్నె మొత్తం ఖాళీ అవ్వాల్సిందేనని ఆ విషయంలో తనని ఎవరూ ఓడించలేరని కూతురుపై ప్రేమను వ్యక్తపరిచారు.

Telugu Shareheartfelt, Fathers Day, Klinkara, Ram Charan, Tollywood-Movie

క్లీంకార ఇప్పుడిప్పుడే కుటుంబ సభ్యుల్ని గుర్తిస్తోందని, సినిమా షూటింగ్ లకు వెళ్లినప్పుడు తనని ఎంతో మిస్‌ అవుతున్నట్లు తెలిపారు.ఇకపై తన బిడ్డతో ఎక్కువ సమయం వెచ్చించేలా తదుపరి చిత్రాల షెడ్యూల్స్‌ ప్లాన్‌ చేసుకోనున్నట్లు తెలిపారు.క్లీంకారతో ఉన్నప్పుడు తన తండ్రి చిరంజీవి ఆమెకు పెద్దన్నలా మారిపోతారని ఆమెతో తాత అని పిలిపించుకోవడం బోర్‌గా ఫీలవుతారని చిరుత అని పిలవమంటూ మురిసిపోతారని తెలిపారు.

ఇక కెరీర్‌ విషయంలో భవిష్యత్తులో తన బిడ్డ తల్లి బాటలో నడిస్తే బాగుంటుందని ఆకాంక్షించారు.ఎందుకంటే ఇప్పటికే తమ కుటుంబంలో చాలామంది నటులు ఉన్నారని సినిమాల విడుదల విషయంలో తాము పోరాడుతున్నామని ఇప్పుడీ రంగంలో తన కూతురితో గొడవ పడటం తనకిష్టం లేదని చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం రామ్‌చరణ్‌ నటిస్తున్న గేమ్‌ ఛేంజర్‌ ముగింపు దశలో ఉండగా.బుచ్చిబాబు దర్శకత్వంలో చేయాల్సిన సినిమా చిత్రీకరణకు సిద్ధమవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube