సినిమా ఫ్లాప్ అయిన సమయంలో పార్టీ చేసుకుంటాను.. చరణ్ షాకింగ్ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్( Ram Charan ) కెరీర్ ను అద్భుతంగా ప్లాన్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే.గేమ్ ఛేంజర్ సినిమాతో( Game Changer ) ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్న చరణ్ బుచ్చిబాబు డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తున్నారు.

 Ram Charan Shocking Comments About Movie Flop Details, Ram Charan, Ram Charan Sh-TeluguStop.com

సినిమా ఫ్లాప్ అయితే పార్టీ చేసుకుంటానంటూ రామ్ చరణ్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.క్లీంకారతో( Klin Kaara ) ఎక్కువ సమయం గడపటానికి ప్రాధాన్యత ఇస్తున్నానని చరణ్ పేర్కొన్నారు.

ఒత్తిడిని ఎలా తీసుకోవాలో నాకు తెలియదని చరణ్ చెప్పుకొచ్చారు.సినిమా ఫ్లాపైన సమయంలో రిలాక్స్ కావడం కోసం పార్టీ చేసుకుంటానని రామ్ చరణ్ కామెంట్లు చేశారు.ఆర్‌ఆర్‌ఆర్‌ ( RRR ) హిట్టైన తర్వాత వారం రోజులు బయటకు రాలేదని కుటుంబంతో ఎంజాయ్ చేశానని చరణ్ పేర్కొన్నారు.వారసత్వం గురించి నేను ఎక్కువగా ఆలోచించనని రామ్ చరణ్ చెప్పుకొచ్చారు.

Telugu Chiranjeevi, Game Changer, Klin Kaara, Ram Charan, Ram Charan Flop, Rrr-M

ప్రస్తుతం ఏం జరుగుతుందో దానిపై మాత్రమే నేను దృష్టి పెడతానని చరణ్ తెలిపారు.తండ్రిగా, కుమారుడిగా, సోదరుడిగా ఈరోజు నా బాధ్యతలను పూర్తిగా న్యాయం చేశానా లేదా అని మాత్రమే నేను ఆలోచిస్తానని ఆయన పేర్కొన్నారు.అదే ముఖ్యమని ప్రతిరోజూ నేను ఇదే ఆలోచిస్తానని రామ్ చరణ్ వెల్లడించారు.అదే ముఖ్యమని ప్రతిరోజూ ఇలాగే చేస్తానని రామ్ చరణ్ పేర్కొన్నారు.

Telugu Chiranjeevi, Game Changer, Klin Kaara, Ram Charan, Ram Charan Flop, Rrr-M

రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించి త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.రామ్ చరణ్ బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్లకు ప్రాధాన్యత ఇస్తుండగా చరణ్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లు బాక్సాఫీస్ ను షేక్ చేయాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.చరణ్ మరిన్ని విజయాలు అందుకోవాలని ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు.రామ్ చరణ్ కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారని సమాచారం అందుతోంది.చరణ్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube