రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దుమాల గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన లక్ష్మి ఎండ దెబ్బకు ఇటీవల మరణించింది.అట్టి పేద కుటుంబానికి ధూమాల గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అందే సతీష్ ఆధ్వర్యంలో సోమవారం మొక్క లక్ష్మి కుటుంబ సభ్యులకు 75 కిలోల రైస్ వితరణ చేశారు.
ఈ నిరుపేద కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ నియోజవర్గం ఇంచార్జి కేకే మహేందర్ రెడ్డి , వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు అందె సతీష్ విజ్ఞప్తి చేశారు.
సతీష్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిరుపేదల పక్షాన నిలబడతదని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కదిరే రజిత శ్రీనివాస్, మాజీ ఎంపిటిసి పొన్నం బాలకృష్ణ గౌడ్ డాక్టర్ బాలయ్య ధర్మారం సతీష్ ఉల్లి అంజయ్య మల్యాల ఎల్లం, ఖానాపురం అంజయ్య , దళిత సంఘాల నాయకులు అందె చంద్రయ్య జంగరామిరెడ్డి గుంటి ఆగం కర్రోళ్ల రాజు బద్దిపడగె మాధవరెడ్డి , ఖానాపురం మైసయ్య, తాటి పెళ్లి అంజయ్య , తదితరులు పాల్గొన్నారు.