పవన్ నాకు బాబాయి కాదు అన్నయ్య.. బాగా ఏడిపించేవారు: సుస్మిత

జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ వచ్చారు.ఈయన ఎన్నికలలో అద్భుతమైన విజయం అందుకోవడంతో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా( AP Deputy CM ) మాత్రమే కాకుండా పలు శాఖలకు మంత్రిగా కూడా త్వరలోనే బాధ్యతలు తీసుకోబోతున్నారు.

 Susmitha Interesting Comments About Pawan Kalyan Details,pawan Kalyan, Susmitha,-TeluguStop.com

ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ కి సంబంధించి ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇకపోతే తాజాగా మెగా డాటర్ సుస్మిత( Susmitha ) సైతం పవన్ కళ్యాణ్ గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Telugu Apdeputy, Charan, Janasena, Susmitha, Paruvu Web, Pawan Kalyan, Ram Chara

సుస్మిత ప్రస్తుతం ఇండస్ట్రీలో నిర్మాతగాను అలాగే కాస్ట్యూమ్ డిజైనర్ గాను వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే సుస్మిత పరువు( Paruvu ) అనే ఒక వెబ్ సిరీస్ నిర్మించారు.ప్రస్తుతం ఈ సిరీస్ జీ 5 లో స్ట్రీమింగ్ అవుతోంది.ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఇందులో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమెకు పవన్ కళ్యాణ్ గురించి పలు ప్రశ్నలు ఎదురయ్యాయి.ఈ సందర్భంగా పవన్ గురించి సుస్మిత మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు నాకు బాబాయ్ కాదు నాకు పెద్దన్నయ్యతో సమానం అని తెలిపారు.

Telugu Apdeputy, Charan, Janasena, Susmitha, Paruvu Web, Pawan Kalyan, Ram Chara

చిన్నప్పటినుంచి కూడా ఒక అన్నయ్య లాగే నాకు ఏం కావాలన్నా తెచ్చి పెట్టేవారు.అందుకే నేను కూడా బాబాయిని ఎప్పుడు బాబాయ్ గా ఫీల్ అవ్వలేదని తెలిపారు.ఇక చిన్నప్పుడు బాబాయ్ నాకు చరణ్ కు( Charan ) బాగా గొడవ పెట్టేవారు.ఆయన ఎప్పుడైతే ఎంటర్టైన్ కావాలనుకుంటారో అప్పుడు చరణ్ కు నాకు గొడవ పెడుతూ తను ఎంజాయ్ చేసే వారని సుస్మిత పవన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఇక ఆయన రాజకీయాల గురించి మాట్లాడుతూ నాకు రాజకీయాల గురించి పెద్దగా అవగాహన లేదు.కానీ బాబాయ్ ఎప్పుడైనా సక్సెస్ అవుతారని భావించాము కానీ ఇంత ఘనవిజయం అందుకోవడంతో మా కుటుంబం మొత్తం సెలబ్రేషన్స్ మూడ్ లో ఉన్నారు అంటూ సుస్మిత ఈ సందర్భంగా పవన్ గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube