ఆ మేనరిజమ్స్‌ జనంలోనుండి పుట్టినవే.. అందుకే నాకింత పాపులారిటీ: మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) గురించి ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు.తెలుగు తెరకి అయన ఓ ఇలవేలుపు.

 Chiranjeevi About Mannerisms In His Movies ,megastar Chiranjeevi ,jagadeka Ve-TeluguStop.com

స్వయంకృషితో ఇంతింత వటుడింతై మహావృక్షంలాగా ఎదిగిన చిరు అంటే ఆయన అభిమానులకు ఎనలేని ఆరాధన.అందుకే 70 ఏళ్లకు దగ్గర పడుతున్నా ఈనాటికీ ఆయన ఫాలోయింగ్ తగ్గలేదు.

ఆ మహా వృక్షం నీడలో నేడు ఎందరో హీరోలు మనగలుగుతున్నారు.అంతేకాకుండా మెగాస్టార్ స్పూర్తితో ఇక్కడ హీరోలైన వారు ఎంతోమంది.

ఇక హీరోలు అందరికీ అభిమానులు ఉండడం సహజమే.కానీ వారి మేనరిజం, డైలాగ్స్‌ చెప్పే విధానం, ప్రేక్షకుల్ని ఆకట్టుకునే పద్ధతిని చూసి అత్యంత కొద్ది మందికే జనాలు తమ గుండెల్లో గుడులు కడుతుంటారు.

వారిలో మెగాస్టార్ చిరంజీవి ఒకరు.

Telugu Gharana Mogudu, Jagadekaveerudu, Chiranjeevi, Tollywood-Movie

మరీ ముఖ్యంగా మాస్‌ సినిమా అంటే హీరోకి ఏదో ఒక మేనరిజం ఉండి తీరాలి.అది ఆ సినిమాలో లెక్కకు మించిన సార్లు కనబడితేనే ఆడియన్స్ థ్రిల్ ఫీల్ అవుతారు.అలా సొంతంగా మేనరిజమ్స్‌ని క్రియేట్‌ చేసి వాటిని ఎక్కువగా పాపులర్‌ చేసిన హీరో మెగాస్టార్‌ చిరంజీవి.

తను సినిమాల్లో చూపించిన మేనరిజమ్స్‌ అన్నీ తనకు తాను అనుకొని చేసినవేనని ఇటీవల ఓ ఇంటర్వ్యూ వేదికగా ఆయన చెప్పుకొచ్చారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… “నా సినిమాల్లోని కొన్ని క్యారెక్టర్స్‌కి విచిత్రమైన మేనరిజమ్స్‌ ఉంటాయి.

వాస్తవానికి అవి నాకు నేనే అనుకున్నవి.ఏ నిర్మాత, డైరెక్టరు నాకు అలా చేయమని ఎన్నడూ చెప్పలేదు.

సొసైటీలో నిత్యం ఎంతో మందిని కలుస్తుంటాం.వాళ్ళని నేను గమనిస్తూ ఉంటాను.

వాటిని పట్టుకొని, ఆ మాటల్ని పదే పదే అంటూ ఉంటే అదే మేనరిజంగా మారిపోతుంది.అలా.చాలా సినిమాల్లో నేను కొన్ని ప్రత్యేకమైన మేనరిజమ్స్‌ చూపించాను.లక్కీగా అవి జనాలకి చాలా బాగా రీచ్ అయ్యేవి.” అంటూ చెప్పుకొచ్చారు.

Telugu Gharana Mogudu, Jagadekaveerudu, Chiranjeevi, Tollywood-Movie

అలా వచ్చినవే… ‘బాక్సులు బద్దలయిపోతాయి’, ‘కొంచెం ఫేస్‌ టర్నింగ్‌ ఇచ్చుకో.’, ‘చెయ్యి చూసావా ఎంత రఫ్‌గా ఉందో.రఫాడిరచేస్తా.

’ వంటి డైలాగ్స్‌.‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ షూటింగ్‌ బొర్రా గుహల్లో జరుగుతున్నపుడు చాలా మంది అభిమానులు రాగా వారిని లోపలికి అనుమతించకపోవడంతో దూరంగా ఉండి షూటింగ్ చూస్తూ ఉండిపోయేవారట.

చిరు , శ్రీదేవి, యూనిట్‌ సభ్యులు లంచ్‌ చేసే సమయంలో ఒక అభిమాని ‘బాసూ.’ అని గట్టిగా అరవగా చిరు కుడివైపు తల తిప్పారట.

దాంతో ఆ అభిమాని ‘ఓసారి ఫేస్‌ లెఫ్ట్‌ టర్నింగ్‌ ఇచ్చుకో బాసూ’ అని అరిచాడట.‘ఘరానా మొగుడు’( Gharana Mogudu ) చిత్రంలో ఎంతో పాపులర్‌ అయిన డైలాగ్‌ అలా పుట్టిందే అంటూ ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారు.

అంటే ఆయన తన సినిమాలలో ప్రయోగించినవన్నీ దాదాపుగా జనాలనుండి తీసుకొన్నవే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube