నా అనుమతి లేకుండా ఆ ఫోటోలు లీక్ చేశారు.. కస్తూరి సంచలన వ్యాఖ్యలు వైరల్!

తెలుగు సినీ ప్రేక్షకులకు నటి కస్తూరి శంకర్( Kasthuri Shankar )గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఈమె ఒకప్పుడు తెలుగులో పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

 Kasthuri Shankar Comments Her Old Photos, Kasthuri Shankar, Old Photos Viral, In-TeluguStop.com

ఇటీవలే స్టార్ మాలో ముగిసిన గృహలక్ష్మి అనే సీరియల్ తో భారీగా పాపులారిటీ సంపాదించుకుంది.ఈ సినిమాతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు మరింత చేరువయ్యింది.

అయితే ఈమె సినిమాలు సీరియల్స్ విషయాలకంటే ఎక్కువగా కాంట్రవర్సీ విషయాలతోనే వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.

Telugu America, India, Sensational, Tollywood-Movie

50 ఏళ్లు వయసు దాటినా ఆమె అందం చెక్కు చెదురలేదు.ఇది ఇలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన ఫోటో షూట్‌కు సంబంధించి చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.కాగా 2000 సంవత్సరంలో కస్తూరి ఒక డాక్టర్‌ను వివాహం చేసుకుంది.

ఆ తర్వాత ఆమె యూరప్‌ వెళ్లిపోయింది.ఆ తర్వాత అమెరికాలో కొంత కాలం ఉంది.

ఆ సమయంలో రోజుల వ్యవధి ఉన్న తన బాబుతో అమ్మతనాన్ని చాటి చెబుతూ అర్ధనగ్నంగా ఫోటోలు దిగింది.అవి కాస్త నెట్టింట వైరల్‌ కావడంతో కొందురు ఆమెను విమర్శిస్తే.మరికొందరు అభినందించారు.

Telugu America, India, Sensational, Tollywood-Movie

తాజాగా కస్తూరి ఆ సందర్భం గురించి ఇలా చెప్పుకొచ్చింది.ఆ ఫోటో షూట్‌ నేను చేసింది ఇండియా కోసం కాదు.అమెరికాలో( America ) ఒక మ్యాగ్జైన్‌ కోసం ఇచ్చాను.

అది భారత్‌లో పబ్లీష్‌( India ) కాకూడదు.కానీ, భారత్‌లో ఉన్న మీడియా వారు సెన్స్‌ లేకుండా ప్రచురించారు.

దేశంలో పేరున్న మీడియా సంస్థనే ముందుగా భారత్‌లో ప్రచురించింది.కనీసం నన్ను కూడా అడగలేదు.

ఇక్కడ ఉన్న వారికి నేను ఎవరికీ అనుమతి ఇవ్వలేదు.కొంత కాలం తర్వాత ఒక ఆంగ్ల పత్రిక నన్ను సంప్రదించి ప్రచురించుకుంది.

అందరూ దొంగతనంగా ఆ ఫోటోలు వేసుకున్నారు.భారత కల్చర్‌కు ఆ ఫొటోలు పెద్దగా నచ్చవు.

అది అమెరికన్‌ ప్రాజెక్టు.ఒక మహిళ డెలివరీ అయిన తర్వాత శరీరంలో మార్పులు వస్తాయి.

దానిని అవగాహాన కల్పించేందుకే ఆ ప్రాజెక్ట్‌ చేశాను.మాతృత్వానికి అమెరికా వాళ్లు ఇచ్చే మర్యాద, మనం ఇచ్చే మర్యాద వేరుగా ఉంటుంది.

ఆ ఫొటోలు లీక్‌ కావడం నాకు కూడా చాలా బాధగా అనిపించింది.బిడ్డకు పాలిచ్చే ఫొటోలను ఇక్కడి వారు చూసే విధానం వేరుగా ఉంటుంది.

కానీ, అది తప్పని తెలుసుకున్నాను అని చెప్పుకొచ్చింది కస్తూరి శంకర్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube